Telangana Rain Update: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఏపీలో కూడా..
సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Hyderabad, Sep 11: తెలంగాణలో (Telangana) మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఆదివారం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం వాయువ్యానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. అటు ఏపీలోనూ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు.
Roja Celebrations: చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా
ఈ జిల్లాల్లో వర్షాలు
ఈ నెల 14న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని వెల్లడించారు.