Representational Image (Photo Credit: ANI/File)

Newdelhi, Sep 11: ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్‌ హైకోర్టు (Madras High) గట్టి షాక్‌ ఇచ్చింది. తల్లిదండ్రులు (Parents) ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను (Property) తిరిగి తీసుకోవచ్చునని సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు రాసే సెటిల్‌మెంట్‌ దస్తావేజులో ప్రేమ, ఆత్మీయతలతో ఆస్తిని ఇస్తున్నట్లు పేర్కొంటే, ఆ పిల్లలు తమకు హామీ ఇచ్చిన విధంగా తమ సంరక్షణ బాధ్యతలను నెరవేర్చకపోతే, ఆ ఆస్తిని ఏకపక్షంగా తిరిగి ఆ తల్లిదండ్రులు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది.

Brazil President on RRR: 'ఆర్ఆర్ఆర్' చిత్రం నాకు బాగా నచ్చింది.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డసిల్వా.. చిత్ర బృందానికి అభినందనలు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే?

ఇదీ కేసు నేపథ్యం..

షకీరా బేగం తన కుమారుడు మహమ్మద్‌ దయాన్‌ పేరు మీద కొంత ఆస్తిని రాశారు. అయితే కుమారుడు తన బాగోగులను పట్టించుకోకపోవడంతో ఆమె తిరుప్పూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కు ఫిర్యాదు చేశారు. తాను రాసిన సెటిల్‌మెంట్‌ డీడ్‌ ను రద్దు చేయాలని కోరారు. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ ఈ డీడ్‌ ను రద్దు చేశారు. దీన్ని మహమ్మద్‌ దయాన్‌ సవాల్‌ చేశారు.

Chandrababu Arrest Update: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబు.. ఖైదీ నెం 7691 కేటాయింపు.. జైల్లో సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతి.. కొనసాగుతున్న ఏపీ బంద్.. పూర్తి వివరాలు ఇవిగో!