Newyork, Sep 11: భారత్ (India) లో నిర్వహించిన జీ20 (G-20) శిఖరాగ్ర సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సదస్సుకు బ్రెజిల్ (Brazil) అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా (Lula Da Silva) కూడా విచ్చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ వచ్చిన ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించారు. భారతీయ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ నచ్చినంతగా మరే చిత్రం నచ్చలేదని తెలిపారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. భారత్ పై బ్రిటీష్ ఆధిపత్యాన్ని తెలియజేస్తూ లోతైన విమర్శ చేయడాన్ని ఈ సినిమాలో అర్థవంతంగా చూపించారని కితాబిచ్చారు. "ఆర్ఆర్ఆర్ దర్శకుడికి, నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని వెల్లడించారు.
#G20Summit: #Brazil's President was recently asked about his love for Indian films, and he talked about watching SS Rajamouli's #RRRhttps://t.co/p0BLWSzMT9
— Hindustan Times (@htTweets) September 11, 2023
కొత్త ఉత్సాహం
లూయిస్ వ్యాఖ్యలపై ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడి మాటలు.. తమ టీమ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.