Telangana Daughters fight for property, Woman's last rites delayed, shocking at suryapet district

Suryapet, July 26: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం రక్త సంబంధాన్ని లెక్కచేయడం లేదు. అది అన్న దమ్ములైన, అక్కా చెల్లెలైన, అన్నా చెల్లెలైన డబ్బు కోసం బంధాలను శాశ్వతంగా దూరం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు మనం ఇలాంటి సంఘటనలను కోకొల్లలు చూశాం. కానీ సూర్యాపేటలో జరిగిన ఈ సంఘటన మాత్రం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.

ఆస్తి కోసం ఏకంగా అక్కా, చెల్లెలు కొట్లాడుతున్నారు. అది కూడా తల్లికి అంత్యక్రియలు చేయకుండా. వివరాల్లోకి వెళ్తె..సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వెల్దినేని నాగమణికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురికి పెళ్లి కాగా ఖమ్మం, గుంటూరు, హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక భర్త చనిపోవడంతో నాగమణి ఒంటరిగానే ఉంటుండగా అనారోగ్యంతో మృతి చెందింది.

ఇక అంత్యక్రియల కోసం వచ్చిన ముగ్గురు కుమార్తెలు ఆస్తి కోసం కొట్టుకున్నారు. చివరకు అంత్యక్రియలు చేయకుండా పంచాయతీ పెట్టారు. దీంతో చివరకు పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేయించడంతో దహన సంస్కరాలు చేయించారు. ఆస్తి కోసం కొట్టుకున్న ఈ న్యూస్ స్థానికంగా విషాదాన్ని నింపింది.  హైదరాబాద్‌ మొఘల్‌పురాలో యువకుడి అఘాయిత్యం, బట్టలారెస్తున్న మహిళ నోరు మూసీ..వైరల్ వీడియో