RBI Raises e-RUPI Voucher Limit: ఈ-రూపీ వోచర్ పరిమితి పెంపు, ఇక లక్ష వరకు ఈ- రూపీ వోచర్ వాడుకునే అవకాశం, ఆర్బీఐ పరపతి సమీక్షలో కీలక నిర్ణయం
ఈ-రూపీ డిజిటల్ (e-RUPI Voucher) వోచర్ వాడకంపై ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. ద్రవ్యపరపతి సమీక్షలో ఈ-రూపీ డిజిటల్ వోచర్ పరిమితి పెంచుతూ నిర్ణయం (increase the e-Rupi digital voucher cap) తీసుకున్నారు.
New Delhi, Feb 10: ఆర్బీఐ జారీ చేసిన డిజిటల్ వౌచర్ వాడకంపై గుడ్ న్యూస్. ఈ-రూపీ డిజిటల్ (e-RUPI Voucher) వోచర్ వాడకంపై ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. ద్రవ్యపరపతి సమీక్షలో ఈ-రూపీ డిజిటల్ వోచర్ పరిమితి పెంచుతూ నిర్ణయం (increase the e-Rupi digital voucher cap) తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ-రూపీ డిజిటల్ వోచర్‌పై (e-RUPI Voucher) రూ.10 వేల వరకు వాడుకునే వెసులుబాటు ఉండేది. ఇక నుంచి రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు ఈ-రూపీ డిజిటల్ వోచర్ వాడుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) తెలిపారు. అంటే ఆర్బీఐ జారీ చేసిన ఈ-వోచర్‌ను రూ.లక్ష వరకు ఒకటికంటే ఎక్కువ సార్లు ఉపయోగించొచ్చు. ఈ -రూపీ డిజిటల్ వోచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గతేడాది ఆగస్టులో ఆవిష్కరించింది. అప్పట్లో దాని లిమిట్ రూ.10 వేలకే పరిమితం చేసింది. ఒక్కసారి మాత్రమే క్యాష్‌లెస్ (Cashless) పేమెంట్‌కు అనుమతించింది.
ఎన్పీసీఐ (NPCI) ఆవిష్కరించిన క్యాష్‌లెష్ ఈ-రూపీ డిజిటల్ ఓచర్‌తో పలు రకాల ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మరింత సమర్థవంతంగా సేవలందించవచ్చు. అన్ని రకాల ప్రభుత్వ పథకాలూ ఎన్పీసీఐ ద్వారానే జరుగుతున్నాయి.