Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’లో అదనపు సీట్లు.. అలాగే టైమింగ్స్ మార్పు.. పూర్తి వివరాలు ఇవే!
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు బయల్దేరే సమయంలో స్వల్ప మార్పు చేసారు. అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తుండటంతో రైలుకు కోచ్ లను రెట్టింపు చేసారు.
Hyderabad, May 16: రైల్వే ప్రయాణికులకు (Railway Passengers) గుడ్ న్యూస్ (Good News). సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు (Secunderabad-Tirupati Vande Bharat Express) సంబంధించి రైల్వే అధికారులు (Railway Officials) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు బయల్దేరే సమయంలో స్వల్ప మార్పు చేసారు. అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తుండటంతో రైలుకు కోచ్ లను రెట్టింపు చేసారు. ఈ నెల 17వ తేదీ నుంచి పెంచిన కోచ్ ల కారణంగా సీట్లు రెట్టింపు సంఖ్యలో అందు బాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించిన ఈ రైలుకు ప్రస్తుతం 8 కోచ్ లు ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో 52 సీట్లు, చైర్‌కార్‌లో 478 సీట్లతో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ ఏప్రిల్‌లో 131 శాతంగా నమోదైంది.
డిమాండ్ నేపథ్యంలో..
ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఇందులో 14 ఏసీ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. అలాగే సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది. వారం మొత్తంలో మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు యధావిధిగా నడుస్తోంది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి పెరిగిన సీట్లతో పాటుగా టైమింగ్స్ లో స్వల్ప మార్పులతో రైలు నడవనుంది. ఉదయం 6గంటలకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701) రైలు మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరేలా అధికారులు మార్పులు చేశారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరే రైలు(20702) నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.