Newdelhi, May 16: కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్స్ (Hospitals), సీజీహెచ్ఎస్ (CGHS) వెల్‌నెస్ కేంద్రాల్లోని (Wellness Centres) వైద్యులకు (Doctors) కేంద్రం తాజాగా హెచ్చరిక చేసింది. తమ వద్దకు వచ్చే రోగులకు (Patients) ప్రభుత్వ వైద్యులు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే రాసి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆసుపత్రుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకపోకలపై కూడా పరిమితి ఉండాలని వైద్యులకు సూచించింది. ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
The Centre has warned doctors at central government-run hospitals and CGHS wellness centres to comply with the norms of prescribing generic medicines failing which action will be taken against them.https://t.co/AIs2sR7yBw
— Economic Times (@EconomicTimes) May 15, 2023
ఎందుకు ఈ ఆదేశాలు?
వైద్యులు తమ రోగులకు ఖరీదైన బ్రాండెడ్ ఔషధాలు ప్రిస్క్రైబ్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్రం తెలిపింది.