AICC Leaders with Congress Chief Mallikarjun Kharge. (Photo Credits: Twitter@INC)

Bengaluru, May 15: కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) ఎవరనే విషయంలో తలెత్తిన ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది.సీఎం ఎంపిక నిర్ణయం అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్‌పీ (CLP) సింగిల్ లైన్ తీర్మానం చేయడంతో సీను ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

ఇక డీకే శివకుమార్‌ ఢిల్లీ టూర్‌ను రద్దు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా యూటర్న్‌ తీసుకున్నారు. కడుపు నొప్పి వల్ల ఢిల్లీకి వెళ్లడం లేదన్నారు. అలాగే సీఎం పదవి చేపట్టనున్న సిద్ధరామయ్యను డీకే శివకుమార్‌ అభినందించారు.ఆయనకు (సిద్ధరామయ్యకు) అభినందనలు, గుడ్‌ లక్‌’ అని అన్నారు.

డికే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్న సోనియా, సిద్ధరామయ్యకే సై అంటున్న రాహుల్, కర్ణాటక సీఎం ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్

ఈ పరిస్థితులు ఇలా ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌(61) పార్టీ హైకమాండ్‌కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని చెబుతున్న ఆయన.. అవసరమైతే నిరసన తెలుపుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే. ఒంటరిగా కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా. పైగా కాంగ్రెస్‌ చీఫ్‌(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు.

అలాగే.. వేరే వాళ్ల బలంపై నేను మాట్లాడను. అవసరమైతే నిరసన తెలుపుతా అంటూ పేర్కొన్నారాయన.గతంలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోకుండా పార్టీని తిరిగి బలోపేతం చేశానని అన్నారు. అయితే సీఎం పదవి విషయంలో పార్టీ హైకమాండ్‌ తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అలాగే తన విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

నాకు కడుపులో ఇన్‌ఫెక్షన్‌, అందువల్ల ఢిల్లీ వెళ్లలేనని తెలిపిన డికె శివకుమార్, 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడి

తిరుగుబాటు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేనేం తిరుగుబాటు చేయను. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను. నేనేం బచ్చాగాడ్ని కాదు. నాకంటూ ఓ విజన్‌ నాకుంది. అలాగే పార్టీ పట్ల విధేయత కూడా ఉంది. ముందు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకోనివ్వండి అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన.

ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై ( Chief Minister Tussle) కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. అయితే సిద్ధరామయ్యను సీఎంగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం చేయడంతోపాటు ఆయనకు కీలక శాఖలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నది.

అనుకున్నదే అయింది! కర్ణాటక సీఎం ఎంపిక బాధ్యత అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేల తీర్మానం, ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?

ఇక కొందరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లిన సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనే ముఖ్యమంత్రి అవుతానని ఆశిస్తున్నా. నిన్న(ఆదివారం) జరిగిన సీఎల్పీ భేటీలో మెజార్టీ ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయానికే కట్టుబడి ఉంటా. డీకే శివకుమార్‌తో నాకు మంచి స్నేహం ఉంది’’ అని 75 ఏళ్ల సిద్ధరామయ్య పేర్కొన్నారు.

సిద్ధరామయ్య వెంట ఉన్న ఎమ్మెల్యేలలో దళిత, మైనార్టీ, ట్రైబల్‌, ఓబీసీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ వర్గాల ప్రజాప్రతినిధుల మద్దతు తనకు ఉందని అధిష్టానం బలనిరూపణ కోసమే ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది.ఇవాళ రాత్రి పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీతో భేటీ అవుతారనే ప్రచారం నడుస్తోంది.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు ఏఐసీసీ పరిశీలకుడు, కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. మూడు గంటలపాటు వీళ్లు భేటీ జరిగింది. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి ప్రతిపాదనను సైతం డీకే తిరస్కరించినట్లు సమాచారం. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేకుంటే కేబినెట్‌లో స్థానం కూడా వద్దంటూ డీకే, సూర్జేవాలాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.