Bengaluru, May 14: కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (Congress LP Meet) సమావేశం ముగిసింది. నూతన సీఎం ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగిస్తూ సీఎల్పీ తీర్మానం చేసింది. దీంతో బాల్ ను ఖర్గే (Mallikarjuna Kharge) కోర్టులో వేశారు. లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు ఏఐసీసీ (AICC) పరిశీలకుల బృందం ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. కర్ణాటక సీఎం రేసులో సిద్ధారామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ లు (DK Shivakumar) ఉన్నారు.
Resolution copy of Congress CLP meeting
Congress Legislature Party has unanimously decided to leave the selection of Congress Legislature Party leader to the decision of the AICC President
#KarnatakaElectionResults2023 pic.twitter.com/74tpAcTrsn
— ANI (@ANI) May 14, 2023
ఎల్పీ సమావేశం జరుగుతున్న ప్రాంతంలో ఇరువురు నేతలకు చెందిన అనుచరులు హల్ చల్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మల్లిఖార్జున ఖర్గే... కర్ణాటక సీఎం ఎంపికపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలో సమావేశమయ్యారు. ఏఐసీసీ దూతల నుంచి సమాచారాన్ని తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశముంది. లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి పరిశీలకులుగా సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను నియమించారు.
#WATCH | Bengaluru: Sloganeering by the supporters of Siddaramaiah and DK Shivakumar outside the Shangri-la hotel where CLP meeting is underway#KarnatakaElectionResults pic.twitter.com/Fi2ck3LjxR
— ANI (@ANI) May 14, 2023
అయితే కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మంగళవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది (Karnataka New CM). కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. ఇక కాంగ్రెస్ భావజాలానికి సరిపోయే ప్రాంతీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ప్రమాణ స్వీకారం కాగానే కర్ణాటక మంత్రివర్గం కూర్పు ఒకటి రెండు రోజుల్లో రూపుదిద్దుకుంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.