West Bengal CM Mamata Banerjee (Photo Credits: Facebook)

Kolkata, May 15: రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ నేత మమతా బెనర్జీ తొలిసారిగా తన వైఖరి ఏంటో ముందుగానే స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట తమ పార్టీ మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట పోరాడనివ్వండి అని అన్నారు. అందుకు తమ మద్దతు ఇక్కడ ఇస్తామని చెప్పారు.కానీ అదేసమయంలో వారు కూడా ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వాలన్నారు.

కర్ణాటక సీఎం ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్‌కు పగ్గాలు అందించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్

కాంగ్రెస్‌ మద్దతు పొందాలంటే మొదటగా అది కూడా ఇతర పార్టీలకు మద్దతివ్వాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బలమైన ప్రాంతీయ పార్టీలకు తప్పక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈమేరకు ఆమె బీజేపీని ఓడించేలా కొత్త వ్యూహ రచనను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలు అన్ని తమ కంచుకోటలో బీజేపీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్‌ మాత్రం తన సొంత సీట్లను గెలవడంపై దృష్టి సారించాలన్నారు.