Telugu States Weather Forecast: మరో మూడు రోజులు పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్, హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షాలు

అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Hyderabad Rains (phot0-Video Grab)

Hyd, June 6: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం (Heavy Rain) దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, షేక్ పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, అశోక్ నగర్‌, బషీర్ బాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, ఆఫ్జల్ గంజ్, నాంపల్లి,మంగళ్ హాట్, కవాడిగూడ, అశోక్ నగర్, దోమలగూడ, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లిలో భారీ వర్షం పడుతోంది.

ఈ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది వరదనీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి వాహనదారుల, పాదచారులు ఇబ్బంది పడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.  హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, ఇంటికి వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు, వీడియోలు ఇవిగో..

గురువారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం, శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణకేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.

అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.