గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది.. LB నగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.వర్షంధాటికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వాతావరణ అధికారులు నైరుతి రుతపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసింది. వీడియో ఇదిగో, అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన టీజీఎస్ఆర్టీసీ బస్సు, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ 35 మంది ప్రయాణికులు
Here's Videos
Rain alert in Cyberabad.
Heavy Waterlogging at Shilparamam toawrds Kothaguda.
Madhapur Traffic Police are working to ensure free flow of Traffic.
05.06.2024, 17.52 pic.twitter.com/iHfJKMKL0e
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) June 5, 2024
మాదాపూర్‌లో వర్షం దంచికొడుతోంది. వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ వరదనీటితో జనాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో.. #hyderabad #hyderabadRains #chotanewsexclusive #groundReport pic.twitter.com/AKho2MJG2k
— ChotaNews (@ChotaNewsTelugu) June 5, 2024
Flooded Streets at Bandlaguda pic.twitter.com/dZLMeD6Ctg
— Shakeel Yasar Ullah (@yasarullah) June 5, 2024
దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం వల్ల క్రియేట్ అయిన పరిస్థితులు.. రోడ్ల మీద వరదనీరు పోటెత్తింది#hyderabad #hyderabadRains #dilsukhnagar #chotanews pic.twitter.com/EE0oftyfN4
— ChotaNews (@ChotaNewsTelugu) June 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)