TTD SED Tickets: నేడు శ్రీవారి 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో.. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల
శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
Tirumala, Nov 10: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. మొత్తం 2.25 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేల టికెట్ల చొప్పున 10 రోజుల పాటు 20 వేల టికెట్లను టీటీడీ విడుదల చేయాలని నిర్ణయించింది.
ఈ కోటా కూడా..
నేటి సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను కూడా టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఇక డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠద్వార దర్శన టికెట్లను కూడా విడుదల చేయనున్నట్టు టీటీడీ మరో ప్రకటనలో తెలియజేసింది.