US Visa Interviews On Saturdays: అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఇక శనివారాల్లోనూ ఇంటర్వ్యూ

దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు శనివారం కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.

Credits: Twitter

Hyderabad, Jan 23: అమెరికా వీసా (America Visa) కోసం దరఖాస్తు (Apply) చేసుకుని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ (Good News). దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు (Consulate Embassy) శనివారం (Saturday)  కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ (Interview) చేసే ప్రక్రియను ప్రారంభించాయి. అంతేకాదు, గత శనివారం (21న) ఇంటర్వ్యూలు నిర్వహించాయి.

చైనాలో కొనసాగుతున్న కరోనా బీభత్సం.. ఇప్పటికే 80 శాతం జనాభాకు వైరస్... వారం రోజుల్లో 13 వేల మరణాలు

వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి కోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్లు శనివారం ప్రత్యేకంగా కార్యకలాపాలు నిర్వహించాయి. వచ్చే నెలలోనూ ఎంపిక చేసిన శనివారాల్లోనూ వీసా దరఖాస్తుదారుల కోసం అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. వీసా కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న నేపథ్యంలో దౌత్య కార్యాలయాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అలాగే, గతంలో అమెరికా వీసా కలిగిన వారికి ఇంటర్వ్యూ లేకుండా రిమోట్ ప్రాసెసింగ్ విధానాన్ని అమెరికా విదేశాంగ శాఖ అమలు చేస్తోంది.

చెదిరిన టీమిండియా కల, పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ ను ఓడించిన న్యూజిలాండ్, హాకీ వరల్డ్ కప్‌లో వెనుదిరిగిన భారత్

వీసాల జారీ ప్రక్రియ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు జనవరి-మార్చి మధ్య వాషింగ్టన్, ఇతర ఎంబసీల నుంచి పదుల సంఖ్యలో అధికారులు భారత్‌కు రానున్నారు. అదనపు అపాయింట్‌మెంట్ల కోసం ముంబై కాన్సులేట్ జనరల్ వారంలో పనిగంటల సంఖ్యను పెంచింది. ఈ వేసవికల్లా భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో అదనపు సిబ్బంది సాయంతో వీసాల జారీ ప్రక్రియ కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటుందని అమెరికా అధికారులు తెలిపారు.

సింగర్ మంగ్లీ కారుపై రాళ్లతో దాడి, బళ్లారిలో పాటపాడి వస్తుండగా దాడికి పాల్పడ్డ దుండగులు, ఆ వ్యాఖ్యలే దాడికి కారణమా?



సంబంధిత వార్తలు

Kamala Harris: ఓటమిని అంగీకరిస్తున్నా...ఎన్నికల ఫలితాలపై కమలా హారిస్, ట్రంప్‌కు ఫోన్‌..అభినందనలు చెప్పిన కమలా , ప్రజల స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం

Visa Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1,400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న డిట్ కార్డ్ సర్వీస్ కార్పొరేషన్ వీసా ఇంక్

Driverless Electric Vehicle: డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రూపొందించిన బోసన్ మోటార్స్, మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజయవంతంగా డెమో ప్రదర్శన...వీడియో ఇదిగో

Nara Lokesh: శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయం సందర్శన, పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం