Weather Forecast: మళ్లీ దూసుకొస్తున్న తుపాన్, రెండు మూడు రోజుల్లో మోగా విరుచుకుపడే అవకాశం, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Representational Image (Photo Credits: PTI)

VJY, Dec 14: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వీడియో ఇదే.. ఉయ్యూరులో పోలీసుల బెదిరింపులు, వ్యభిచార గృహంలో కూర్చుని పేకాడుతూ.. దుస్తులు మార్చుకొని వస్తారా, లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లలా అంటూ ఓవర్ యాక్షన్

ఏపీలో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి, విశాఖపట్టణం, బాపట్ల సహా పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు భయపెట్టాయి. తుపాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి. మరోవైపు, రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరిక జారీ చేసింది.

అవ్వాతాతలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, వచ్చే నెల నుంచి పెన్షన్‌ను రూ.2750కి పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం, జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు

మాండూస్ తుపాన్త తగ్గిందనే లోపే తెలుగు రాష్ట్రాలకు మోగా తుపాను ముప్పు పొంచివుంది. రెండు రోజుల్లో మోగా తుపాను విరుచుకుపడుతుందని వాతావ‌ర‌ణ‌శాఖ ప్రకటించింది. దీంతో రైతులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురవుతున్నారు. ఇప్పటికే చాలా పంట నష్టపోయామని, మళ్లీ వర్షాలు పడితే కోలుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత రెండురోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అంతేగాక, హైదరాబాద్ నగరం, ఇతర జిల్లాలు కూడా ముసురుపట్టిన వాతావరణాన్ని అనుభవించాయి.