ఏపీలో కృష్ణాజిల్లా ఉయ్యూరు పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఆకునూరులో వ్యభిచారం నడుపుతున్నట్టు సమాచారం రావడంతో ఉయ్యూరు రూరల్ పోలీసులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఒక విటుడిని, ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వ్యభిచార గృహంలో దర్జాగా కూర్చోని చేత్తో పేక ముక్కలు ఆడిస్తూ యువతులను పోలీసులు బెదిరించారు. దుస్తులు మార్చుకొని వస్తారా, లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లలా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉయ్యూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వీడియో ఇదే..
Here's Video
వ్యభిచారం రైడ్‌కని వెళ్లి దర్జాగా కూర్చుని పేకాలాడిస్తూ, "పచ్చిగా ఉంటది మాతో యవ్వారం, నైటీల మీదే కొట్టుకుంటూ తీస్కెళ్లాలా బట్టలు మార్చుకుంటావా" అంటున్నాడీ పోలీసు
ఉయ్యూరు రూరల్ pic.twitter.com/T77YQWwNdJ
— Anjan (@pdsdnn) December 14, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)