Jagananna Sampoorna Gruha Hakku: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, అందరూ లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగా ఉగాది వరకు పథకం పొడిగింపు
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (Jagananna Sampoorna Gruha Hakku) ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Mohan Jagan Reddy) అన్నారు.
Tanuku, Dec 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో (West Godavari Tanuku) లాంఛనంగా ప్రారంభించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (Jagananna Sampoorna Gruha Hakku) ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Mohan Jagan Reddy) అన్నారు. 'ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా సొంతింటి కల (Housing Scheme) నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు.
సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు. గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయించాము. 26వేల కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశాము. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేశాము. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇచ్చాము. 52లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ అక్షరాలా రూ.లక్షా 58వేల కోట్లు. అందరూ లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగానే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉగాది వరకు పొడిగిస్తున్నాం' అని సీఎం జగన్ అన్నారు. ముఖ్యమంత్రి హోదా లో ఆయన తొలిసారి తణుకు విచ్చేశారు.
ఓటీఎస్ పథకం ద్వారా సంపూర్ణ గృహహక్కు కల్పించే దిశగా 22–ఏ తొలగింపు, స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, యూజర్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్ పత్రం, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సుమారు రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించే దిశగా ఓటీఎస్ పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటీఎస్ పథకానికి 1,43,072 మంది అర్హులు ఉండగా ఇప్పటివరకూ 1,04,524 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరందరికీ శాశ్వత గృహహక్కు పత్రాలు అందించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు.