CM YS Jagan reviews on Clean AP program (Photo-Twitter/AP CMO)

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) శుభవార్త చెప్పింది. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 2019, జూలై 1 నుంచి డీఏ వర్తించనుంది. ఫలితంగా ఉద్యోగులు (Government Employees) వచ్చే ఏడాది జనవరి నుంచి జీతంతో డీఏ తీసుకోనున్నారు.

డీఏ బకాయిలను 2022 జనవరి నుంచి మూడు విడతలుగా చెల్లిస్తారు. డీఏ ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చైర్మన్‌ కే వెంకట రామిరెడ్డి. అన్నారు

ఇక ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్గత సమీక్ష ముగిసింది. గత సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు.. మరికొన్ని అంశాలపై కూడా సమీక్షలో చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.  అనంతరం సజ్జల రామాకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘పీఆర్సీపై ముఖ్యమంత్రితో వివరంగా చర్చించాం. ఈ అంశం త్వరలోనే కొలిక్కి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులకు వివరించాం’’ అని తెలిపారు.