Lucknow Building Collapse: కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురు, రాత్రంతా సహాయక చర్యలు, 14 మంది సేఫ్‌

ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల కింద ఉన్న వారిలో ఇప్పటి వరకు 14 మందిని రక్షించారు. మరో ఐదుగురు లోపలే ఉన్నట్లు భావిస్తున్నారు. వారికి ఆక్సీజన్ అందే అవకాశం లేకపోవడంతో ..రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతం చేశారు. రాత్రంతా సహాయక చర్యలను కొనసాగించారు.

Uttar Pradesh Building Collapse: (Photo-ANI)

Lucknow, JAN 25: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో (Lucknow Building Collapse) నాలుగంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల కింద ఉన్న వారిలో ఇప్పటి వరకు 14 మందిని రక్షించారు. మరో ఐదుగురు లోపలే ఉన్నట్లు భావిస్తున్నారు. వారికి ఆక్సీజన్ అందే అవకాశం లేకపోవడంతో ..రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతం చేశారు. రాత్రంతా సహాయక చర్యలను కొనసాగించారు. లక్నోలోని, హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఒక నాలుగంతస్థుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు (NDRF) సహాయక చర్యలు ప్రారంభించాయి. లోపల ఉన్నవారందరినీ కూడా సురక్షితంగా రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Lucknow Building Collapse: 35 కుటుంబాలు శిధిలాల కిందనే, 7 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, లక్నోలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం 

ఇంకా ఐదుగురు శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఇద్దరితో మాట్లాడారు. వారికి ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల తొలగింపు, బాధితుల్ని రక్షించే ప్రయత్నాలు అన్నీ శాస్త్రీయంగా జరుగుతున్నాయని ఉత్తర ప్రదేశ్ డీజీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఎవరికీ ఎలాంటి హానీ కలగకుండా బాధితుల్ని రక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే, కూలిపోయిన బిల్డింగ్‌కు ఎలాంటి అనుమతీ లేదన్నారు. బిల్డింగ్ యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.