యూపీ రాజధాని లక్నోలో నాలుగు అంతస్థుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అరవై మంది దాకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. 7 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. భవనంలో 30-35 కుటుంబాలు నివసిస్తున్నాయని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు.
ఇప్పటికే మూడు మృతదేహాలను వెలికి తీశారు సహయక బృందాలు. వజీర్ హసన్‌గంజ్ రోడ్‌లోని ఓ నివాస సముదాయం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కూలిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే.. పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Here's ANI Tweet
Lucknow building collapse | 7 people have been rescued and sent to hospital. They were unconscious. Rescue operation underway. People are saying that 30-35 families were living in the building: UP Deputy CM Brajesh Pathak pic.twitter.com/kMllGcFTEy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)