ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది(Lucknow Road Accident). సీసీటీవీలో రికార్డు అయిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందిరా నగర్‌లోని రోడ్డులో కారు టర్న్ అయి వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్‌.. కారును ఢీ కొట్టింది(Car Collides with Bike). ఈ ఘటనలో కారుపై నుండి అమాంతం ఎగిరిపడ్డాడు యువకుడు. తీవ్ర గాయాలు కాగా అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో ఇదిగో, తాగుబోతు భర్త హింస తట్టుకోలేక లోన్‌ రికవరీ ఏజెంట్‌తో పారిపోయిన మహిళ, వీరి వివాహాన్ని చూసేందుకు ఎగబడిన స్థానికులు

ఇక మరో ఘటనలో తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య లోన్‌ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్‌తో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకున్న ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్‌లోని జముయ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. తన భర్త తాగి వచ్చి తనను కొట్టేవాడని, శారీరకంగా వేధించేవాడని అందుకే..అతడి హింసను భరించలేక పరిచయమైన పవన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

Car Collides with Bike in Indira Nagar, Accident Video goes viral

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)