అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Satyendra Das)(85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లఖ్‌నవూలోని ఆస్పత్రిలో వైద్యం కోసం చేర్పించినట్లు తెలిపారు. సత్యేంద్ర దాస్ మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆదివారం ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. తాము అందిస్తున్న వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.
Ayodhya Ram Mandir’s Chief Priest Suffers Brain Haemorrhage
श्रीराम मंदिर के मुख्य पुजारी सत्येन्द्र दास को स्ट्रोक पड़ने के बाद एसजीपीजीआई के न्यूरोलॉजी वार्ड एचडीयू में भर्ती हैं। उनकी हालत गंभीर बनी हुई है।
— Anuj Tandon (@anujtandon85) February 3, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)