ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh)లక్నోలో వింత సంఘటన జరిగింది. లక్నోలోని బుద్ధేశ్వర్ రోడ్‌లోని ఎంఎం లాన్ గెస్ట్ హౌస్‌లో బుధవారం రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా అనుకోని అతిథిగా చిరుతపులి(Leopard at Marriage) వచ్చింది. దీంతో చిరుతను చూసిన వారు పరుగులు పెట్టారు. లోపలికి ప్రవేశించింది
అయితే ఆ సమయంలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఫంక్షన్ హాల్లోనే ఉండగా చిరుతను చూసి వారూ పరుగెత్తికెళ్లి కారులో కూర్చుకున్నారు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకే కాదు అక్కడున్న దాదాపు 200 మంది పాయిపోయి దాక్కోగా నాలుగు గంటల పాటు హంగామా చేసింది చిరుత. చివరకు తెల్లవారుజామున 2 గంటలకు చిరుతను పట్టకున్నారు అటవీ శాఖ అధికారులు.
ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఎక్స్ వేదికగా స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంలో పెరిగిన అవినీతి కారణంగా అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని అందుకే చిరుతపులి నగరంలోకి వచ్చిందని మండిపడ్డారు. వచ్చింది చిరుత కాదు,పెద్ద పిల్లి అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అని ఎద్దేవా చేశారు.
Leopard Hulchal At Marriage in Lucknow
उप्र की ‘जुमलाजीवी’ भाजपा सरकार अभी छुट्टा पशुओं की समस्या का ही समाधान ढूँढ नहीं पाई थी कि उसके सामने अब एक और चुनौती आ गई है और वो है प्रदेश की राजधानी में ‘तेंदुए’ का हमला।
लखनऊ में एक शादी समारोह में तेंदुए के प्रवेश का समाचार चिंताजनक है। भाजपा सरकार में भ्रष्टाचार का एक… pic.twitter.com/0DxyUMT4jh
— Akhilesh Yadav (@yadavakhilesh) February 13, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)