Firecracker Explodes at Kerala Temple: కేరళ ఆలయంలో భారీ పేలుడు.. 150 మందికి పైగా తీవ్ర గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం.. బాణసంచా పేలుస్తుండగా ఘటన (వీడియో)
సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 150 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
Newdelhi, Oct 29: కేరళలో (Kerala) కాసర్ గోడ్ జిల్లాలోని నీలేశ్వరంలో గల ప్రఖ్యాత అంజుతాంబళం వీరార్కవు ఆలయంలో భారీ పేలుడు (Firecracker Explodes at Kerala Temple) సంభవించింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 150 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని మరింత మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రులకు తరలించారు.
Here's Video:
అలా ప్రమాదం
కేరళలో నాలుగు నెలలపాటు కొనసాగే సంప్రదాయక థెయ్యం ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంజుతాంబళం వీరార్కవు ఆలయంలో థెయ్యం ఉత్సవాలను నిర్వహించారు. వాటిని చూడటానికి వందలాది మంది ఈ ఆలయానికి చేరుకున్నారు. 12 గంటల సమయంలో ఉత్సవాల ప్రారంభోత్సవానికి గుర్తుగా బాణసంచా పేల్చారు. వాటి నిప్పు రవ్వలు ఎగిరిపడి ఒక్కసారిగా అవన్నీ పేలిపోయాయి. దీంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒటి డీకొన్న 5 కార్లు