Maharashtra Farmer Suicides: 300 మంది రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్రలో అధికార కుమ్ములాటకు బలైన కర్షకులెందరో..,ఒక్క నవంబర్ నెలలోనే జరిగిన విషాద ఘటన ఇది, దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించిన రెవిన్యూ శాఖ

గతేడాది నవంబర్ నెలలో(November) సీఎం పీఠం కోసం నాయకులు (Fight For Cm Seat)) కొట్టుకుంటూ రైతుల సమస్యలను గాలికొదిలేసారు. అకాల వర్షాలతో పంటంతా నేలపాలవ్వడంతో రైతులు (farmers) రోడ్డెక్కారు. చేసిన అప్పులు ఎక్కువ కావడం, చేతికి అందిన పంటను అకాల వర్షాలు నాశనం చేయడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు.

300 Maharashtra Farmers Committed Suicide In November, Highest Ever In Single Month ( Image used for representational purpose only (Picture Credits: PTI)

Mumbai, January 3:  గతేడాది నవంబర్ నెలలో మహారాష్ట్రలో (Maharashtra)   అధికారం కోసం జరిగిన కుమ్ములాటలో  300 మంది రైతులు ఆత్మహత్యలు(Maharashtra farmer suicides) చేసుకున్నారు. ఆ సమయంలో సీఎం పీఠం కోసం నాయకులు (Fight For CM Seat)) కొట్టుకుంటూ రైతుల సమస్యలను గాలికొదిలేసారు. అకాల వర్షాలతో పంటంతా నేలపాలవ్వడంతో రైతులు (farmers) రోడ్డెక్కారు. చేసిన అప్పులు ఎక్కువ కావడం, చేతికి అందిన పంటను అకాల వర్షాలు నాశనం చేయడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు.

నాయకులు ఏవైనా భరోసా ఇస్తారనుకుంటే వారు పదవీ వ్యామోహంలో పడి వారిని గాలికొదిలేసారు. ఏ పార్టీ కూడా వారివైపు చూడలేదు. ఓట్ల కోసమయితే వెళ్లారు గాని ఫలితాలు వెలువడిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ నేపథ్యంలోనే రైతులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడమే ఉత్తమమని భావించి ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

మహారాష్ట్రలో రైతుల నిరసనలు, దెబ్బతిన్న పంటతో రోడ్డెక్కిన రైతులు

నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పలితాల అనంతరం (Maharashtra 2019 Assembly Election Results) అధికారం కోసం ఒకవైపు కుమ్ములాటలు కొనసాగుతున్న సమయంలోనే 300 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం ప్రకటించింది. 2019 అక్టోబరు 14 నుంచి 2019 నవంబరు 11వ తేదీ వరకు ఒక్క మరాఠ్వాడా ప్రాంతంలోనే 68 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

నన్ను‘మహా’ సీఎం చేయమంటున్న రైతు, బీజేపీ-శివసేన మధ్య కుదరని పొత్తుకు నిరసనగా నిర్ణయం

కాగా 2019 నవంబరు నెలలో 300 రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే దిగ్భ్రాంతికర విషయాన్ని రెవెన్యూ శాఖ వెల్లడించింది. అక్టోబర్‌లో అకాల వర్షాల కారణంగా మరాఠ్వాడాలో 70 శాతం ఖరీఫ్‌ పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అక్టోబర్, నవంబర్‌ నెలలో ఆత్మహత్యలు 61 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. ఇలా ఒకే నెలలో 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం 2015లోనూ చోటుచేసుకుందని తెలిపింది.

రాత్రికి రాత్రే మారిన మహా రాజకీయాలు

20 ఏళ్ల కరువు తర్వాత మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ప్రభుత్వం

మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ