maharashtra-protesting-farmers-detained-by-police-in-mumbai (Photo-ANI)

Mumbai, November 14: మహారాష్ట్ర (Maharashtra) పరిస్థితి రోజురోజుకు దయనీయమవుతోంది. నిన్నటిదాకా రాజకీయాలు (Politics) మహాను కుదిపేస్తూ ఇప్పుడు రైతు సమస్య ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. రాష్ట్రపతి పాలనతో ఉన్న మహారాష్ట్ర ఇప్పుడు రైతుల ధర్నాల(Maharashtra Farmers Protest)తో దద్దరిల్లుతోంది. అక్కడ రైతులు రోడ్లెక్కారు.

ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిడంతో చాలామంది రైతులు నష్టపోయారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులంతా(crop damage due to unseasonal rains ) తమను ఆదుకోవాలని ఆందోళనకు దిగారు.

ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముంబై ప్రధాన రహదారి మీదుగా రాజ్‌భవన్ వరకు రైతులు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

రైతుల నిరసనలు

అకాల వర్షాలతో (Due to unseasonal rains)నష్టపోయిన రైతులంతా రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ….నిరసన తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న ఉల్లి కాడలు, ఇతర పంటల భాగాలను రైతులు చేతిలో పట్టుకుని తమ నిరసన తెలియజేశారు. గవర్నర్ వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.

రాజ్‌భవన్ వరకు రైతులు ర్యాలీ

అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మహారాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహారాష్ట్రలో అధికార ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో అక్కడ గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించారు.