Man Stuck in Leopard Cage: కోడికోసం వెళ్లి పులిబోనులో చిక్కిన వ్యక్తి, చిరుతను పట్టుకునేందుకు పెట్టిన కోడిని దొంగిలించేందుకు యత్నించిన వ్యక్తికి దిమ్మతిరిగే షాక్

కానీ తెల్లారి వచ్చి చూసేసరికి అందులో ఓ మనిషి (man got stuck in a cage) ఇరుక్కున్నాడు. అది చూసి అధికారులతో పాటూ, స్థానికులు షాక్ అయ్యారు. ఇంతకీ అతను బోన్ లో ఎందుకు పడ్డాడో తెలుసా? పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని (rooster) చోరీ చేసేందుకు అతడు ప్రయత్నించాడు

Man Stuck in Leopard Cage (PIC @ ANI Twitter)

Lucknow, FEB 24: ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. కానీ తెల్లారి వచ్చి చూసేసరికి అందులో ఓ మనిషి (man got stuck in a cage) ఇరుక్కున్నాడు. అది చూసి అధికారులతో పాటూ, స్థానికులు షాక్ అయ్యారు. ఇంతకీ అతను బోన్ లో ఎందుకు పడ్డాడో తెలుసా? పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని (rooster) చోరీ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే డోర్‌ మూసుకుపోవడంతో ఆ వ్యక్తి పులి (leopard) బోనులో చిక్కుకుపోయాడు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో జరిగింది. ఆ జిల్లా పరిధిలోని బసెందువా గ్రామంలో ఒక చిరుత పులి సంచరిస్తున్నది. భయాందోళన చెందిన గ్రామస్తులు దాని గురించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిరుత జాడను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది దానిని పట్టుకునేందుకు ఆ గ్రామంలో ఒక బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎర కోసం ఆ బోనులో ఒక కోడిని ఉంచారు.

కాగా, పులి బోనులో ఉన్న కోడిపై ఒక వ్యక్తి కన్ను పడింది. ఆ కోడిని చోరీ చేసి ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినాలని అతడు భావించాడు. గుట్టుగా ఆ బోనులోకి ప్రవేశించాడు. లోపలున్న కోడిని పట్టుకున్నాడు. అయితే ఆ వెంటనే ఆ పులి బోను మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి బోను లోపల చిక్కుకున్నాడు. తనను రక్షించాలంటూ అరవడంతోపాటు బోరున ఏడ్చాడు.

Mumbai Shocker: పుట్టిన రోజు మర్చిపోయాడని భర్తను రక్తమొచ్చేలా కొట్టిన భార్య, అడ్డువచ్చిన అతని తల్లిపై కూడా దాడి, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు 

మరోవైపు శుక్రవారం ఉదయం గ్రామస్తులు దీనిని గమనించారు. బోనులో పులికి బదులు ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చిరుత కోసం ఎరగా ఉంచిన కోడిని చోరీ చేసేందుకు ప్రయత్నించిన అతడు అందులో చిక్కుకున్నట్లు గ్రహించారు. అటవీ శాఖ అధికారులకు దీని గురించి సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు వెళ్లారు. బోను ముందున్న ఇనుప ఊచల డోర్‌ను తెరిచి ఆ వ్యక్తిని బయటకు రప్పించారు. కాగా, స్థానికులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్