Adani vs Hindenburg: అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం, అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలని సెబీకి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని (directs SEBI for probe) దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది.

Supreme Court today slashed an 18-year jail sentence (Photo Credits: IANS)

New Delhi, Mar 1: అదానీ గ్రూపు - హిండెన్‌బర్గ్‌ వివాదంలో (Adani vs Hindenburg) సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని (directs SEBI for probe) దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెగ్యులేషన్‌ నిబంధనల ఉల్లంఘన ఉంటే కచ్చితంగా సెబీ విచారణ చేపట్టాలని ఆదేశించింది.

కుప్పకూలిపోతున్న అదానీ సామ్రాజ్యం, కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన LIC, భారీ నష్టాలపై స్పందించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

దీనికి సంబంధించిన విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జ్‌ జస్టిస్‌ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని (Supreme Court constitutes expert panel) ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ న్యాయమూర్తులు జేపీ దేవదత్, ఓపీ భట్‌తోపాటు కేవీ కామత్‌, నందన్‌ నీలేకని, సోమశేఖర​ సుందరేశన్‌ ఉన్నారు. ఈ ప్యానెల్‌కు అన్నివిధాలా సహకారాన్ని అందించాలని కేంద్రం, ఆర్థిక చట్టబద్ధమైన సంస్థలు, సెబీ చైర్‌పర్సన్‌ను బెంచ్ ఆదేశించింది.

గౌతం అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ, 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా బిలియనీర్

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై దర్యాప్తు కోరుతూ దాఖలైన నాలుగు పిటిషన్‌ల బ్యాచ్‌ను విచారించిన సుప్రీంకోర్టు గురువారం ప్యానెల్ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు.అదానీ గ్రూప్‌లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.