రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, బిలియనీర్ ముఖేష్ అంబానీ సంపదలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్ అదానీ 83.9 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు. ఈ మేరకు ఫోర్బ్స్ సంస్థ రియల్ టైమ్ బిలియనీర్స్ -2023 జాబితాను వెల్లడించింది.
అంబానీ సంపద 0.19 శాతం వృద్ధితో 164 మిలియన్ డాలర్‌లు పెరుగగా, అదానీ సంపద 4.62 శాతం నష్టంతో 84.1 బిలియన్ డాలర్‌లు కరిగిపోయిందని ఫోర్బ్స్ పేర్కొన్నది. ఇటీవల హిండెన్ బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌లో లొసుగులను బయటపెట్టడంతో ఆ సంస్థ షేర్‌లు భారీ నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.
దాంతో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 10వ స్థానానికి పడిపోయారు. అదానీ కంటే అంబానీ ఒక అడుగు ముందుకేసి 9వ స్థానంలో కొనసాగుతున్నారు.