Coronavirus-Man Commits Suicide: ఏపీలో కరోనా పుకారు కలకలం, జ్వరాన్ని కరోనా వైరస్‌గా భావించి వ్యక్తి ఆత్మహత్య, చిత్తూరు జిల్లాలో విషాద ఘటన

కరోనా వైరస్ (Coronavirus) గురించి వచ్చిన అనుమానాలతో ఓ వ్యక్తి తన నిండు జీవితాన్ని వదిలేసుకున్నాడు. అతనికి కొంచెం జ్వరంగా ఉంటంతో మొబైల్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన వీడియోలు (Coronavirus-related videos) చూసి తనకు నిజంగానే కరోనా వచ్చిందేమోనని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Fearing he has coronavirus infection, AP man kills self (Representative (Image: PTI)

Tirupati,Febuary 12: ఏపీలో (Andhra Pradesh) దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ (Coronavirus) గురించి వచ్చిన అనుమానాలతో ఓ వ్యక్తి తన నిండు జీవితాన్ని వదిలేసుకున్నాడు. అతనికి కొంచెం జ్వరంగా ఉంటంతో మొబైల్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన వీడియోలు (Coronavirus-related videos) చూసి తనకు నిజంగానే కరోనా వచ్చిందేమోనని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఘోస్ట్ నగరంగా మారిన చైనా

ఇండియాకు ఇంకా కరోనా వైరస్ రాలేదని, అలాంటి పుకార్లు నమ్మవద్దని చెబుతున్నా ఎవరూ వినడం లేదు. ఈ చిన్న వ్యాధి కనిపించినా వెంటనే కరోనా వచ్చిందంటూ పుకారు లేపేస్తున్నారు. అలాంటి పుకారుతోనే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది.

అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్

గ్రామస్తుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా (Chittoor) తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగకు చెందిన బాలకృష్ణ (50) గుండె దడగా ఉందని పరీక్షల కోసం తిరుపతి రుయాకు వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్‌ సోకిందని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చి తనకు కరోనా వైరస్‌ సోకిందని, తనను ముట్టుకోవద్దని కుటుంబ సభ్యులతో చెప్పాడు.

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

తనలో ఉన్న జ్వరం లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాలు (Coronavirus Infection)ఒకేలా ఉన్నాయని తెలుసుకొని… తన తల్లితండ్రులను కూడా తన దగ్గరకు రానివ్వకుండా ఓ గదిలోకి వెళ్లి తనను తాను నిర్భందించుకున్నాడు. తన దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో తరిమి కొట్టి గదిలోకి వెళ్ళి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అధికారులకు పోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

సోమవారం తెల్లవారు జామున గదిలోంచి బయటకు వచ్చిన బాలకృష్ణ తన పొలానికి వెళ్లాడు. అక్కడ తల్లి సమాధి వద్ద ఉన్నచెట్టుకు ఉరేసుకుని ఆత్య హత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు.

విస్కీతో కరోనాను చంపేయవచ్చట

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారులు వైరస్ పట్ల ప్రచారం కల్పించకపోవడంతోనే బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు

ఈసందర్భంగా వాలంటీర్‌గా పనిచేస్తున్న ఆయన పెద్దకుమారుడు మాట్లాడుతూ తన తండ్రికి చదువులేదని, రుయా ఆసుపత్రిలో ఏమిచెప్పారో తెలియదుకాని తనకు కరోనా వైరస్ సోకిందని తమను దగ్గరకు రానీయకుండా ఒంటరిగా ఉంటూ వచ్చాడని, కనబడకుండా వెళ్లిన తరువాత ఆయన సమాధి వద్దకు వెళతాడని తాము ఊహించలేకపోయామన్నారు.

చైనాలో చిక్కుకున్న భారతీయులను ఆఘమేఘాల మీద ఇండియాకు తరలింపు

డాక్టర్లు ఆయనకు కౌన్సిలింగ్ చేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 100కు డయల్ చేశానని, 1100కు కూడా ప్రయత్నించానని, వారి ద్వారానైనా కౌన్సిలింగ్ ఇప్పించాలని ప్రయత్నించానని, అయితే స్పందన లేదన్నారు.