TTD Cancels Standing System: టీటీడీ సంచలన నిర్ణయం, భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి, టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతి, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు

భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా చెక్ (TTD Cancels Standing System) పెట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus in India) వణికిస్తున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Singhl) వివరాలను వెల్లడించారు.

coronavirus outbreak: Unwell devotees asked to skip trip to Tirupati (Photo-PTI)

Tirumala, Mar 15: కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి ధాటికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా చెక్ (TTD Cancels Standing System) పెట్టింది.

టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3309 కోట్లు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus in India) వణికిస్తున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Singhl) వివరాలను వెల్లడించారు.

కంపార్ట్‌మెంట్లులో వేచి ఉంటే భక్తులకు కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది.

తిరుమలను సందర్శించే విదేశీయులు, ప్రవాస భారతీయులపై టిటిడి ఆంక్షలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. కరోనా నివారణను కోరుతూ.. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు- దగ్గు ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దు.

‘దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోందని, వైరస్‌ వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నామని ఆయన సింఘాల్ తెలిపారు. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదని. దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది. తిరుమలని సెక్టార్ లుగా విభజించి, శుభ్రత చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. గదులు కాళీ చేసిన వెంటనే పూర్తిగా సుద్ది చేసిన తర్వాత మరొకరికి కేటాయిస్తున్నామని అన్నారు.

జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు

అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదు. సీతారాముల కళ్యాణం రద్దు చేసి, లైవ్ ద్వరా కళ్యాణం వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలి. భక్తులు కూడా సహకరించాలి’ అని సింఘాల్ తెలిపారు.