File image of Tirupati Balaji Temple | (Photo Credits: PTI)

Tirumala- Tirupati, March 11: దేశంలో కరోనావైరస్ భయాందోళనల  (Coronavirus Scare) నేపథ్యంలో ఇప్పటికే దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారిపై ఆంక్షలు విధించిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డ్, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. విదేశీయులు, ప్రవాస భారతీయులలు (Foreigners & NRIs) తిరుమలను సందర్శించకుండా నిషేధం విధించింది. విదేశాల నుంచి వచ్చిన వారెవ్వరూ కూడా 28 రోజుల పాటు తిరుమలను సందర్శించవద్దని టిటిడీ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రోజురోజుకు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకునే లక్షల మంది భక్తుల ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని టిటిడి బోర్డ్ తెలిపింది. తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు- దగ్గు ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దు.

కాగా,   కరోనాప్రభావిత దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి వచ్చిన 465 మంది ప్రయాణికులను పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. వీరిలో 232 మందిని ఇప్పటికే గృహ నిర్భంధంలో ఉంచాము, 7 మంది మినహా మిగతా 226 మంది 'నిర్భంధ కాలాన్ని' పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ 7 మంది ఆసుపత్రుల్లో చేరారని వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

అలాగే ఫిబ్రవరి 29 నుంచి ఇప్పటివరకు ఇటలీ దేశంలో పర్యటించివచ్చిన 75 మంది ప్రయాణికులను గృహ నిర్భంధంలో ఉంచామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు చోట్ల కరోనావైరస్ నిర్ధారణ కేంద్రాలు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ లక్షణాలు కనిపించిన 35 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే అందులో 33 మందికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని, మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.