New Delhi, March 9: భారతదేశంలో కరోనావైరస్ (COVID-19) వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 52 వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశంలో సోమవారం మరో మూడు కొరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ 43 కు చేరుకుంది. ఆదివారం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు మొత్తంగా నాలుగు కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎగువన జమ్మూకాశ్మీర్ నుంచి దిగువన కేరళ వరకు బాధితులు ఉన్నారు. కేరళలోని ఎర్నాకుళం నుంచి ఒకరు, దిల్లీ నుంచి ఒకరు, ఉత్తర ప్రదేశ్ నుంచి ఒకరు మరియు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక మహిళ ఉన్నారు. వీరంతా ఇటీవల విదేశీ పర్యటనలకు వెళ్లివచ్చిన వారేనని సమాచారం.
కాగా, ఈ 43 మంది కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో తొలి మూడు కేసులు కేరళ నుంచి నమోదైనవి, గత ఫిబ్రవరి నెలలో చైనా నుంచి కేరళ వచ్చిన ఆ ముగ్గురు చికిత్స తర్వాత కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారి కరోనావైరస్ బాధితులు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని విమానాశ్రయాలలో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతీ ప్రయాణికుడికి అక్కడికక్కడే స్క్రీనింగ్ చేసి, లక్షణాలు కనిపించిన వారందరినీ వైరస్ నిర్ధారణ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అలా ఇప్పటివరకు 8,255 విమానాల నుండి మొత్తం 8,74,708 అంతర్జాతీయ ప్రయాణీకులను విమానాశ్రయాలలో పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిలో వ్యాధి లక్షణాలు కనిపించిన వారు 1,921 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 177 మంది ఇప్పటికే ఆసుపత్రుల్లో చేరారు, వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. మరో 33,599 మంది ప్రయాణికులు పరిశీలనలో ఉండగా 21,867 మంది ప్రయాణికులు వారి పరిశీలన వ్యవధిని పూర్తి చేసుకున్నారు. తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు-దగ్గుతో శ్రీవారి దర్శనానికి రావొద్దని కోరిన టీటీడీ
అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనావైరస్ నిర్ధారణ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. రాష్ట్రాల వారిగా ఏయే నగరాలలో వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయో తెలిపే జాబితా కింద ఇవ్వబడింది.
Full List of Coronavirus Testing Centres in India:
52 testing sites for COVID ‐19 | ||
State/UT | LIST OF VRDLs | |
Andhra Pradesh | 1 | Sri Venkateswara Institute of Medical Sciences, Tirupati |
2 | Andhra Medical College, Visakhapatnam, Andhra Pradesh | |
3 | GMC, Anantapur, AP | |
Andaman & Nicobar islands | 4 | Regional Medical Research Centre, Port Blair, Andaman and Nicobar |
Assam | 5 | Gauhati Medical College, Guwahati |
6 | Regional Medical Research Center, Dibrugarh | |
Bihar | 7 | Rajendra Memorial Research Institute of Medical Sciences, Patna |
Chandigarh | 8 | Post Graduate Institute of Medical Education & Research, Chandigarh |
Chhattisgarh | 9 | All India Institute Medical Sciences, Raipur |
Delhi-NCT | 10 | All India Institute Medical Sciences, Delhi |
11 | National Centre for Disease Control, Delhi | |
Gujarat | 12 | BJ Medical College, Ahmedabad |
13 | M.P.Shah Government Medical College, Jamnagar | |
14 | Pt. B.D. Sharma Post Graduate Inst. of Med. Sciences, Rohtak, Haryana | |
Haryana | 15 | BPS Govt Medical College, Sonipat |
Himachal Pradesh | 16 | Indira Gandhi Medical College, Shimla, Himachal Pradesh |
17 | Dr.Rajendra Prasad Govt. Med. College, Kangra, Tanda, HP | |
Jammu and Kashmir | 18 | Sher‐e‐ Kashmir Institute of Medical Sciences, Srinagar |
19 | Government Medical College, Jammu | |
Jharkhand | 20 | MGM Medical College, Jamshedpur |
Karnataka | 21 | Bangalore Medical College & Research Institute, Bangalore |
22 | National Institute of Virology Field Unit Bangalore | |
23 | Mysore Medical College & Research Institute, Mysore | |
24 | Hassan Inst. of Med. Sciences, Hassan, Karnataka | |
25 | Shimoga Inst. of Med. Sciences, Shivamogga, Karnataka | |
Kerala | 26 | National Institute of Virology Field Unit, Kerala |
27 | Govt. Medical College, Thiruvananthapuram, Kerala | |
28 | Govt. Medical College, Kozhikode, Kerala | |
Madhya Pradesh | 29 | All India Institute Medical Sciences, Bhopal |
30 | National Institute of Research in Tribal Health (NIRTH), Jabalpur | |
Meghalaya | 31 | NEIGRI of Health and Medical Sciences, Shillong, Meghalaya |
Maharashtra | 32 | Indira Gandhi Government Medical College, Nagpur |
33 | Kasturba Hospital for Infectious Diseases, Mumbai | |
Manipur | 34 | J N Inst. of Med. Sciences Hospital, Imphal‐East, Manipur |
Odisha | 35 | Regional Medical Research Center, Bhubaneswar |
Puducherry | 36 | Jawaharlal Institute of Postgraduate Medical Education & Research, Puducherry |
Punjab | 37 | Government Medical College, Patiala, Punjab |
38 | Government Medical College, Amritsar | |
Rajasthan | 39 | Sawai Man Singh, Jaipur |
40 | Dr. S.N Medical College, Jodhpur | |
41 | Jhalawar Medical College, Jhalawar, Rajasthan | |
42 | SP Med. College, Bikaner, Rajasthan | |
Tamil Nadu | 43 | King's Institute of Preventive Medicine & Research, Chennai |
44 | Government Medical College, Theni | |
Tripura | 45 | Government Medical College, Agartala |
Telangana | 46 | Gandhi Medical College, Secunderabad |
Uttar Pradesh | 47 | King's George Medical University, Lucknow |
48 | Institute of Medical Sciences, Banaras Hindu University, Varanasi | |
49 | Jawaharlal Nehru Medical College, Aligarh | |
Uttarakhand | 50 | Government Medical College, Haldwani |
West Bengal | 51 | National Institute of Cholera and Enteric Diseases, Kolkata |
52 | IPGMER, Kolkata |
విదేశాల నుంచి వచ్చిన వారు లేదా విదేశీ ప్రయాణాలు చేసి భారత్ వచ్చిన ప్రయాణికులందరూ తమ యాత్ర వివరాలను మరియు తమ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను 'సెల్ఫ్ డెక్లరేషన్' పత్రాలలో సమగ్రంగా నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని ఆన్ని రాష్ట్రాలు మరియు యూటీలలో కరోనావైరస్ స్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్ వర్ధన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.