Fire Accident in Tamil Nadu: తమిళనాడులోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఏడుగురు.. మృతుల్లో బాలుడు కూడా..! (వీడియో)

ఓ ప్రైవేటు హాస్పిటల్‌ లో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మైనర్‌ బాలుడు సహా ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు.

Fire Accident in Tamil Nadu (Credits: X)

Chennai, Dec 13: తమిళనాడులోని (Tamil Nadu) దిండిగుల్ లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌ లో జరిగిన ఈ  ప్రమాదంలో ఓ బాలుడు సహా ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. వీరు లిఫ్ట్‌ లో స్పృహలేని స్థితిలో కాలిపోయి కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో మరో 30 మంది రోగులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. వారిని అక్కడి నుంచి వెంటనే ప్రభుత్వ దవాఖానకు అధికారులు తరలించారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌ భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు గూగుల్ వినూత్న డూడుల్

Here's Video:

కారణం ఇదేనా?

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన చేరుకోవడంతో ప్రమాద తీవ్రత తగ్గినట్టు పేర్కొన్నారు.

నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన