ATMs Shutting Down: 12 నెలల్లో 4 వేల ఏటీఎంలు మూత.. డిజిటల్ లావాదేవీల పెరుగుదలే కారణం
అయితే, విచిత్రంగా దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్ వర్క్ లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.
Newdelhi, Nov 9: దేశంలో నగదు చలామణి (Cash Transaction) కొత్త రికార్డులకు చేరుకొంటున్నాయి. అయితే, విచిత్రంగా దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం (ATM) నెట్ వర్క్ లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి. నిరుడు సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా 2.19 లక్షల ఏటీఎంలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య 2.15 లక్షలకు తగ్గినట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది.
ఎందుకు?
డిజిటల్ చెల్లింపులకు ఆదరణ పెరుగుతుండటంతో బ్యాంకులు ఏటీఎంలపై ఫోకస్ తగ్గించినట్టు నిపుణులు చెప్తున్నారు.
ప్రతి లక్ష మందికి 15 ఏటీఎంలు
దేశంలో చాలా ఏటీఎంలు మూతపడటంతో ప్రస్తుతం ప్రతి లక్ష మంది ప్రజలకు 15 చొప్పున ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో నగదు వినియోగానికి, ఏటీఎంల లభ్యతకు మధ్య తీవ్ర అసమతుల్యత కొనసాగుతున్నది.