Ayodhya Tragedy: పెను విషాదం..సరయూ నదిలో పన్నెండు మంది గల్లంతు, ఆరుగురు మృత్యువాత, ముగ్గురు సేఫ్, కానరాని మరో ముగ్గురి ఆచూకి, రెండో రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

అయోధ్యలోని సరయు నదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గుప్తార్‌ ఘాట్‌ వద్ద నీటిలో మునిగిపోయారు. వెంటనే స్థానికులు ముగ్గురిని రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Lucknow, July 10: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం (Uttar Pradesh Tragedy) చోటుచేసుకుంది. అయోధ్యలోని సరయు నదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గుప్తార్‌ ఘాట్‌ వద్ద నీటిలో మునిగిపోయారు. వెంటనే స్థానికులు ముగ్గురిని రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈతగాళ్లను పిలిపించి మిగతా వారికోసం సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను (6 Members of Family Drown) వెలికితీశారు. మునిగిన వారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఏడేళ్ల బాలిక నీటిలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలను కాపాడుకుంది.

కాగా ఆగ్రాకు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు అయోధ్యను సందర్శించేందుకు వచ్చారు. వీరిలో కొంతమంది చేతులు, కాళ్ళు కడుక్కోగా, మరికొందరు స్నానం చేసేందుకు నదిలో దిగారు. అదే సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగడంతో 12 మంది నీటిలో (Ayodhya Tragedy) గల్లంతయ్యారు. మిగిలిన వాళ్లు వారిని రక్షించేందుకు ప్రయత్నించగా.. ఫలితం లేకుండా పోయింది.

ఇప్పటి వరకు 9 మందిని బయటకు తీశామని.. వారిలో ఆరుగురు చనిపోయారని, మరో ముగ్గురిని రక్షించేందుకు (3 Missing) సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అనుజ్‌కుమార్‌ తెలిపారు. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రక్షించిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

అసలేం జరిగింది..ఐస్ క్రీం తిని అత్త మృతి, తరువాత రోజు అల్లుడు హోటల్‌లో మృతి, మిస్టరీగా మారిన అత్త రోసీ సంగ్మా, అల్లుడు శామ్యూల్ సంగ్మా మరణాలు, కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ, గురుగ్రామ్‌ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

కాగా గుప్తర్‌ఘాట్ సర్యూ నదిలో ఈ రోజు రెండవ రోజు సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, పిఎసి బృందాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. ఈ బృందం సర్యూ నదిలో మిగతా ముగ్గురి కోసం శోధిస్తోంది. సర్యూ నది గుప్తార్‌ఘాట్ నుంచి కొత్త ఘాట్ రామ్ కి పైడి వరకు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సుమారు 10 కిలోమీటర్ల ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. నిన్న రాత్రి 12 గంటల వరకు సహాయక చర్యలు జరిగాయి. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ 65 మంది సభ్యుల 2 బృందాలు సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందం, పిఎసి బృందాన్ని మోహరించారు.