Covaxin Vaccine: కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న 10 రోజులకు చనిపోయిన వాలంటీర్, విష ప్రయోగం జరిగిందని అనుమానాలు, అతని మరణానికి వ్యాక్సిన్ కారణం కాదని తెలిపిన భారత్ బయోటెక్
టీకా తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని ఇద్దరు నర్సులు మృతి చెందారనే వార్తలు (Volunteer Dies 10 Days After Taking Bharat Biotech's Covaxin) రాగా... తాజాగా ఈ జాబితాలోకి దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ (COVAXIN) కూడా చేరింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ తీసుకున్న ఓ వలంటీర్ పది రోజుల తర్వాత మృతి చెందాడనే వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది.
Bhopal, Jan 9: ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనుకోని సంఘటనలు బయటకు వస్తున్నాయి. టీకా తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని ఇద్దరు నర్సులు మృతి చెందారనే వార్తలు (Volunteer Dies 10 Days After Taking Bharat Biotech's Covaxin) రాగా... తాజాగా ఈ జాబితాలోకి దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ (COVAXIN) కూడా చేరింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ తీసుకున్న ఓ వలంటీర్ పది రోజుల తర్వాత మృతి చెందాడనే వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది.
భోపాల్‌కు చెందిన దీపక్ మరవి (42) గతేడాది డిసెంబర్ 12న పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్‌లో నిర్వహించిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొని కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత పది రోజులకు అతడు మరణించాడు. ఈ క్రమంలో కోవాగ్జిన్ ట్రయల్‌లో పాలు పంచుకున్న మెడికల్ కాలేజీ వైస్ చాన్సిలర్ మాట్లాడుతూ.. ‘దీపక్ మరవి వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా కోవాగ్జిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లు తెలిసింది.
విష ప్రయోగం వల్ల చనిపోయాడని అనుమానిస్తున్నాం.. కానీ మరణానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. విసెరా పరీక్షతో మరవి ఎందువల్ల చనిపోయాడనే విషయం తెలుస్తుంది’ అన్నారు. ఇక మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ.. ‘దీపక్ మరవికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు.
దీనిపై భారత్ బయోటెక్ ( Bharat Biotech's Covaxin) స్పందించింది. అతను కోవిడ్ వ్యాక్సిన్ వల్ల చనిపోలేదని ఇతరత్రా అనారోగ్యం వల్ల చనిపోయాడని తెలిపింది. విషప్రయోగం వల్ల అతడు చనిపోయి ఉంటాడని భావిస్తున్నామని తెలిపింది. అది వ్యాక్సిన్ తో సంబంధం లేని మరణమని వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతను ఆరోగ్యంగానే ఉన్నాడని కంపెనీ తెలిపింది. ట్రయల్స్‌లో పాల్గొన్న అందరిని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించాం.. ఆ తర్వాత ఎనిమిది రోజులు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచాం’ అని వైద్యులు తెలిపారు.
42 ఏళ్ల మరవి గతేడాది డిసెంబర్ 21న చనిపోయాడు. ఈ విషయాన్ని డీసీజీఐ, భారత్ బయోటెక్ దృష్టికి తీసుకెళ్లాం. ఇక వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడాకి ముందు మరవికి అన్ని పరీక్షలు చేశాం. అంతా బాగుంది అనుకున్నాకే వ్యాక్సిన్ డోసు తీసుకునేందుకు అనుమతిచ్చాం. ఇక ట్రయల్స్‌లో పాల్గొన్న అందరికి వ్యాక్సిన్ ఇవ్వరు. సగం మందికి వ్యాక్సిన్ ఇచ్చి.. మిగతావారికి సెలైన్ ఇస్తారు. ప్రస్తుతం దీపక్‌కి ఇచ్చింది వ్యాక్సిన్ డోసా లేకా.. సెలైనా అనే విషయం తెలియాలని వైద్యులు చెబుతున్నారు.