Coronavirus in India (Photo-PTI)

Washington, Jan 9: అగ్రరాజ్యం అమెరికాలో కరోనావిలయానికి అల్లాడిపోతోంది. కొన్ని నెలల కిందట వరకు అమెరికా ప్రాణాంతక వైరస్ ప్రభావంతో విలవిల్లాడింది.ఇక ఇటీవలే అమెరికాలో బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కూడా ప్రవేశించింది. అయితే, బ్రిటన్ రకం కరోనాకు తోడు మరో కొత్తరకం స్ట్రెయిన్ (Covid US variant) అమెరికాలో వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా మళ్లీ పెరుగుతుండడంతో ఇది అమెరికా రకం కరోనా వైరస్ (USA variant' of coronavirus) వల్లనే అని గుర్తించారు.

దీనిపై వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్ రాష్ట్రాలకు హెచ్చరికలు చేసింది. అమెరికా రకం కరోనా స్ట్రెయిన్ తో 50 శాతం అధికంగా వ్యాప్తి ఉండొచ్చని పేర్కొంది. మాస్కులు ధరించకపోయినా, భౌతికదూరం నిబంధనలు కచ్చితంగా పాటించకపోయినా దీని ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, రూపాంతరం చెందిన కరోనా వైరస్ రకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అమెరికాలో గడిచిన 24 గంటల్లో దాదాపు మూడు లక్షల వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మూడువేలకుపైగా జనం మృత్యువాతపడ్డారు. జాన్స్‌ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2.90లక్షల మంది వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. అలాగే ఒకే రోజు 3,676 వైరస్ మరణాలను నమోదు చేసినట్లు జాన్స్‌హాప్కిన్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. అంతకు ముందు రోజు వైరస్‌తో నాలుగువేల మంది వరకు మృతి చెందారు.

గొంతు నొక్కేందుకు జరుగుతున్న కుట్ర, తన ట్విట్టర్ ఖాతా బ్యాన్‌పై స్పందించిన డొనాల్డ్ ట్రంప్, త్వరలో కీలక ప్రకటన చేస్తామని వెల్లడి, సొంత వేదికను ఏర్పాటు చేసే దిశగా అడుగులు

కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ప్రకారం.. ప్రస్తుతం 1.31లక్షల మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 21.8 మిలియన్ కరోనా వైరస్ కేసులు నమోదవగా.. 3.68లక్షల మంది వరకు మృత్యువాతపడ్డారు.