Uttar Pradesh: బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ వేధింపులు, ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన కోడలు అంకిత, అత్తమామలతో పాటు నా భర్త, అతడి సోదరులే నా చావుకు కారణమంటూ వీడియో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ క్రమంలో తన చేతి నరాలను కోసుకున్నారు. తీవ్రంగా రక్తస్రావమై స్పృహ కోల్పోయిన అంకితను లక్నో సివిల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
Lucknow, March 15: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ కోడలు అంకిత ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో తన చేతి నరాలను కోసుకున్నారు. తీవ్రంగా రక్తస్రావమై స్పృహ కోల్పోయిన అంకితను లక్నో సివిల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు అంకిత అత్తింటి వారి వల్ల తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. రెండు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను ఆత్మహత్య (Bjp Mp's Daughter-in-law Threatens Suicide) చేసుకోబోతున్నట్లు తెలిపారు.
నా భర్త ఆయుష్, మామ ఎంపీ కౌషల్ కిశోర్ (BJP MP Kaushal Kishore), అత్త అయిన ఎమ్మెల్యే జై దేవితో పాటు నా భర్త సోదరులు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ బాధలు భరించలేక చనిపోవాలనుకుంటున్నాను. అత్తమామలతో పాటు నా భర్త, అతడి సోదరులే నా చావుకు కారణమంటూ అంకిత వీడియోలో అత్తింటి వారిపై తీవ్రమైన ఆరోపణలు (Serious Allegations Against Her Husband) చేశారు. ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇక ఈ వీడియోలు రెండు సోషల్ మీడియలో వైరల్ కావడంతో సమాచారం పోలీసులకు తెలిసింది.
దాంతో అలీగంజ్ ఎస్పీ అఖిలేష్ సింగ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి, ఆమె కోసం గాలించారు. అర్థరాత్రి దాటాక స్పృహ కోల్పోయిన స్థితిలో (Ankita Attempts Suicide) ఉన్న అంకితను గుర్తించి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా అంకితకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వీడియో ఐదు నిముషాలు ఉండగా, మరో వీడియో మూడు నిముషాలు ఉంది. ఆ వీడియోలో ఆమె తన పుట్టింట్లో ఉంటూ భర్త కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది.
ఇక అతను రాడని భావించి ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని తెలిపింది. తన ఆత్మహత్యకు భర్త, అత్తామలే కారణమని అంకిత పేర్కొంది. ఈ వీడియోను చూసిన ఎస్పీ ఆమెను మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అంకిత, ఆయూష్ గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయూష్ కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడంతో అతను తన భార్య అంకితతో కలిసి మాండియాన్ మొహల్లా ప్రాంతంలో అద్దెకుంటున్నాడు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ నెల 3న ఆయూష్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసుల దర్యాప్తులో తనపై తానే కాల్పులు జరుపుకున్నట్లు వెల్లడించాడు. ఇక నాడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆయూష్.. అంకిత ఆత్మహత్యాయత్నం తరువాత పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వడం కోసం వెలుగులోకి వచ్చాడు.
మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె మామ కౌషల్ కిశోర్ ఎంపీగా గెలుపొందాడు. ఇక ఈ ఘటనపై విపక్షాలు మండి పడుతున్నాయి. ఎంపీ తన కోడలినే ఇలా వేధిస్తున్నాడంటే.. ఇక సామాన్యులకు ఏం న్యాయం చేయగలడు అని ప్రశ్నిస్తున్నారు.