Bois Locker Room Case: అమ్మాయే అబ్బాయి ఐడీతో గ్యాంగ్ రేప్ ఛాట్ చేసింది, బాయిస్ లాక‌ర్ రూమ్ కేసులో బయటపడ్డ ట్విస్ట్, 26 మంది విద్యార్థులు అరెస్ట్

అయితే ఈ 'బాయిస్ లాక‌ర్ రూమ్' కేసులో (Bois Locker Room Case) కొత్త ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, May 11: సోషల్ మీడియా యాప్ ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో (Instagram) కొందరు మగపిల్లలు ‘బాయిస్ లాకర్‌ రూం’ (Bois Locker Room) పేరిట గ్రూపు కట్టి, అందులో తమ సహ విద్యార్థినులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, వారి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేయడం, కొందరు బాలికల పేర్లు చెప్పి, వారిపై సామూహిక అత్యాచారం (Delhi Teenagers gang rape) చేద్దామంటూ మాట్లాడుకోవడం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ 'బాయిస్ లాక‌ర్ రూమ్' కేసులో (Bois Locker Room Case) కొత్త ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది.  మంటగలుస్తోన్న మానవత్వం, పేషెంట్ ఆటోని నిలిపివేసిన పోలీసులు, కిలోమీటర్ దూరం తండ్రిని మోసిన తనయుడు, కేరళలో లాక్‌డౌన్ వేళ హృదయ విదారక ఘటన

త‌మ క్లాస్‌మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ చేద్దాం అంటూ కొంద‌రు విద్యార్థులు చేసిన గ్రూప్ చాట్‌పై విచార‌ణ చేప‌ట్టిన పోలీసుల‌కు విస్తుపోయే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఓ టీనేజీ అమ్మాయే అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిల‌తో చాట్ చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. త‌న శ‌రీరంపై తానే అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేస్తూ, దానికి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని తాను ఈ ప‌ని చేసిన‌ట్లు పేర్కొంద‌ని ఢిల్లీ సైబ‌ర్ పోలీసులు వెల్ల‌డించారు. పోలీసులపై పూల వర్షం, దారి పొడవునా పోలీస్ వాహనాలపై పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్న మీరట్ ప్రజలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

అ అమ్మాయి తన పేరు సిద్దార్థ్‌గా ప‌రిచ‌యం చేసుకొని త‌న శ‌రీరంపై తానే అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసింది. దానికి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బ‌ట్టి త‌న క్యారెక్ట‌ర్ తెలుసుకోవ‌చ్చ‌ని స‌ద‌రు టీనేజీ అమ్మాయి పోలీసుల విచార‌ణ‌లో పేర్కొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా విస్తు పోయారు.

ఢిల్లీలోని ప్ర‌ముఖ స్కూల్‌లో చ‌దువుతున్న కొందరు విద్యార్థులు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేద్దామంటూ చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వీరంతా 18 ఏళ్లు అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారే. అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అస‌భ్య‌క‌రంగా గ్రూప్‌లో చ‌ర్చించుకున్నారు. దీనికి సంబంధించి విచార‌ణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 50మంది విద్యార్థులున్నారు. లాక్‌డౌన్ కాలంలో అంకితభావంతో సేవలందిస్తునందుకు కృతజ్ఞతగా పోలీసులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే

అయితే ఇది పోలీసులకు చేరడంతో గ్రూపులోని ఒక బాలుడు ఆందోళనలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పద్నాలుగేళ్లు కూడా లేని ఒక బాలుడిని యాదృచ్ఛికంగా ఈ గ్రూపులో చేర్చడం, అతను తన సహ విద్యార్థిని మార్ఫింగ్‌ ఫొటోను గమనించి కలవరపడి ఆమెకు స్క్రీన్‌ షాట్‌లు పంపడం, ఆమెనుంచి మరికొందరు బాలికలకు అవి చేరడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇదంతా చూసి కొందరు ఆడపిల్లలు హడలెత్తి అసలు స్కూల్‌కే వెళ్లబోమనడం, ఒకరిద్దరు తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్‌ మాన్పించాలనడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.