Sadhus Murder in UP: శివాలయంలో సాధువుల దారుణ హత్య, యుపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌కి కాల్ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (CM Uddhav Thackeray) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు (Yogi Adityanath) ఫోన్ చేశారు. బులందర్‌షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వెలిబుచ్చారు.
Lucknow, April 28: ఉత్తరప్రదేశ్‌లో శివాలయంలో సాధువుల హత్య కేసు (Sadhus Murder in UP) ఇప్పుడు తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (CM Uddhav Thackeray) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు (Yogi Adityanath) ఫోన్ చేశారు. బులందర్‌షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వెలిబుచ్చారు. యుపీలొ ఇద్దరు సాధువుల దారుణ హత్య, మహారాష్ట్ర ఘటన మరువక ముందే మరో విషాద ఘటన, ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నేరంపై ప్రతిపక్ష నాయకులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కేసులో కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసును రాజకీయం చేయరాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదిత్యనాథ్తో మాట్లాడి హత్యపై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల ముందు, పాల్ఘర్లో ఇద్దరు సాధువులను హతమార్చడంపై ఆదిత్యనాథ్ కు ఉద్ధవ్ ఇలాంటి ఫోన్ కాల్ చేసారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సరిగ్గా ఇదేవిధంగా ఇప్పుడు ఆదిత్యనాథ్‌కు ఠాక్రే ఫోన్ చేశారు.
Here's Shiv Sena MP Sanjay Raut Tweets
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడాను. బులందర్‌షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వ్యక్తపరిచాను. మేము మీతో ఉంటామని ఆయనతో చెప్పాను. ఇలాంటి కేసులో మేము వ్యవహరించినట్టుగానే కఠినంగా ఉండాలని, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని సూచించాను. దీనికి మతం రంగు పూయొద్దని కోరాన’ని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఉద్దవ్ థాకరేకు పదవీ గండం, శాసన మండలి సభ్యునిగా నామినెట్ చేయాలని మంత్రివర్గం మరొకసారి అభ్యర్థన, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని మహారాష్ట్ర గవర్నర్
ఇదిలా ఉంటే పాల్గాఢ్ ఘటనకు మతం రంగు పూయాలని బీజేపీ నాయకులు ప్రయత్నించగా ఉద్ధవ్ సర్కారు సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక శివసేన సీనియర్ సంజయ్ రౌత్ కూడా బులందర్‌షహర్ సాధువుల హత్యకు మతం రంగు పులమకుండా జాగ్రత్త పడాలని ట్విటర్‌లో పేర్కొన్నారు.
సోమవారం రాత్రి బులందర్‌షహర్ జిల్లా పగోనా గ్రామంలోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మురారీ అలియాస్ రాజు అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు శివాలయంలో సాధువుల హత్య కేసును పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. సాధువులతో జరిగిన గొడవ కారణంగానే అతడు వారిని హత్య చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సాధువుల హత్యలో 101 మంది అరెస్ట్, ఒక్క ముస్లిం కూడా లేరు, పాల్గాడ్ ఘటనకు మతం రంగు పూయవద్దు, రాష్ట్ర హోంమంత్రి అనిల్ దినేష్‌ముఖ్ వెల్లడి
బంగు మత్తులో శివాలయంలో పడుకుని ఉన్న సాధువులపై కర్రలతో దాడి చేసి చంపినట్లు వెల్లడించారు. అయితే పోలీసుల విచారణలో మొదట తనకు సాధువులకు ఎటువంటి గొడవ జరగలేదని, దేవుడు కోరినందుకే రెండు హత్యలు చేశానని రాజు చెప్పడం గమనార్హం. అనంతరం పోలీసులు గట్టిగా ప్రశ్నించటంతో అతడు చేసిన నేరం ఒప్పుకున్నాడు.
గుడి దగ్గర గుమికూడిన జనం