Onions At Rs 22-23 Per KG: ఇరవై రెండు రూపాయలకే కేజీ ఉల్లి, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, పోర్టుల వద్ద మిగిలిపోయిన స్టాక్‌ను క్లియర్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం
22 నుంచి రూ. 23కే రాష్ట్రాలకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ప్రస్తుతం ఇలా దిగుమతి చేసుకున్న ఉల్లిని కేంద్రం రూ. 58కి అమ్ముతోంది. అయితే ఈ ధర మీద రాష్ట్రాలు ఉల్లి పాయలను కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తాజాగా ఉల్లి పంట చేతికి రావడం, రుచిలో దేశీయ ఉల్లి బాగుండటమే.
New Delhi, January 31: గత కొద్ది రోజుల క్రితం ఉల్లి ధరలు (Onion Price) దేశ వ్యాప్తంగా ఘాటెక్కిన సంగతి విదితమే.ఈ ఉల్లి ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా నిరసనలు (Protests) కూడా జరిగాయి. అయితే ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం (Central Government) విదేశాల నుండి ఉల్లిపాయలను దిగుమతి (imported onions) చేసుకోవడమే. అయితే ఇలా దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా రాష్ట్రాలకు (States) పూర్తి స్థాయిలో చేరలేదు. స్టాక్ యార్డుల్లోనే మగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని కిలో రూ. 22 నుంచి రూ. 23కే రాష్ట్రాలకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ప్రస్తుతం ఇలా దిగుమతి చేసుకున్న ఉల్లిని కేంద్రం రూ. 58కి అమ్ముతోంది. అయితే ఈ ధర మీద రాష్ట్రాలు ఉల్లి పాయలను కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తాజాగా ఉల్లి పంట చేతికి రావడం, రుచిలో దేశీయ ఉల్లి బాగుండటమే.
నేను గానీ, మా ఇంట్లో గానీ ఎవరు ఉల్లి తినరు
దీంతో విదేశీ ఉల్లిని కొనుగోలు చేయడానికి రాష్ట్రాలు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్‌లో కేంద్రం విదేశాల నుంచి 14 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. అందులో నుంచి భారీస్థాయిలో ఉల్లి అమ్ముడుకుండా పోర్టుల వద్దే మిగిలిపోయింది. ఇలా మిగిలినఉల్లి కుళ్లిపోతుండటం, మార్కెట్‌లో దేశీ ఉల్లి అందుబాటులోకి రావడంతో కేంద్రం ఉల్లి ధరలు తగ్గించాలని నిర్ణయించింది.