Union Finance Minister Nirmala Sitharaman. (Photo Credit: PTI/File)

New Delhi, December 5:  దేశవ్యాప్తంగా ఉల్లి బంగారం అయిపోయింది. రోజురోజుకు ఉల్లి ధరలు (Onion Prices)  సామాన్యుడికి అంతనంత ఎత్తుకు వెళ్తున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాలలో కేజీ ఉల్లి ధర రూ. 120 దాటింది, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ మార్కెట్లో కూడా కేజీ ఉల్లి ధరలు రూ. 125కు చేరుకున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ లోని  పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో కేజీ ఉల్లి ధర రూ. 150 దాటింది.

ఉల్లి ధరల పెరుగుదల వ్యవహారం లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే ఉల్లి ఉత్పత్తి మరియు ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఆమెకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) జవాబు ఇచ్చే సమయంలో "మీరు ఉల్లి తినరా" ? అని మధ్యలో ఒక ఎంపీ అడగగా, అందుకు నిర్మల జోక్యం చేసుకొని "నేను ఉల్లి గానీ, వెల్లుల్లి గానీ ఎక్కువగా తినను, మా ఫ్యామిలీలో కూడా వీటికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు, అందుకే ఈ ధరల పెరుగుదల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి భారం కాదు" అంటూ బదులిచ్చారు.

Check video:

ఇక ఎంపీ సుప్రియకు సమాధానంగా ఉల్లి ఉత్పత్తి మరియు ధరల నియంత్రణకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ఉల్లి ఎగుమతులపై నిషేధం, ఒకరి వద్దే ఉల్లి నిల్వలపై పరిమితులు విధించడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని దేశంలోని కొరత ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

ఇప్పటికే టర్కీ నుంచి 11 వేల టన్నులు, ఈజిప్ట్ నుంచి 6,090 టన్నుల ఉల్లి దిగుమతికి ఆదేశాలు జారీచేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వచ్చే నెల నాటికి ప్రజలకు ఉల్లి అందుబాటులోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.