Madurai, December 9: రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరల(Onion price)కు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. తమిళనాడులోని మధురై(Madurai)లో ఉల్లిధర కిలోకు రూ. 200కు చేరుకుంది.అలాగే మహారాష్ట్రలోని సోలాపూర్,కర్ణాటకలోని బెంగళూరు,తమిళనాడులోని తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కిలో ఉల్లి 200రూపాయలకు(Onions Prices Cross Rs 200/Kg) చేరిపోయింది.
మరోవైపు పలు నగరాలు, పట్టణాల్లో ఉల్లి ధర రూ 150కి ఎగబాకడంతో వంటింట్లో ఉల్లి ఘాటు మాయమైంది. ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట్ర(Maharashtra) సహా పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో పంట దెబ్బతినడం, ఖరీఫ్‌లో పంట దిగుబడి తగ్గడం వంటి కారణాలతో ఉల్లి రిటైల్ ధరలు గత కొద్దివారాలుగా భగ్గుమంటున్నాయి.
ఉల్లి ధర క్వింటాల్‌కు రూ 6000 నుంచి రూ 14,000కు చేరడంతో రిటైల్ ధరలు కిలోకు రూ 200కు ఎగబాకాయని కర్ణాటక వ్యవసాయ మార్కెటింగ్ అధికారి సిద్ధగంగయ్య తెలిపారు. కాగా తమిళనాడుతోని మధురైలో ఉల్లిధర కిలోకు రూ. 200కు చేరుకుంది.
ఈ సందర్భంగా మధురైకి చెందిన వ్యాపారి మూర్తి మాట్లాడుతూ గతంలో వినియోగదారులు ఐదు కిలోల ఉల్లిని తీసుకువెళ్లేవారని, ఇప్పుడు ఒక కిలో లేదా అర కిలో ఉల్లిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. జయశుభ అనే గృహిణి మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి సరిపడా ఉల్లిని కొనుగోలు చేసేందుకు రూ. 350 నుంచి 400 వరకూ ఖర్చుచేయాల్సివస్తున్నదని అన్నారు. ఈ ఏడాది మే నెల తరువాత ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
మరోవైపు ఉల్లి ఖరీదైన వస్తువుగా మారిపోవడంతో పలు చోట్ల ఉల్లి దొంగతనాలు జరగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉల్లి కోరతను తీర్చేందుకు ఈజిప్ట్,టర్కీ దేశాలనుంచి దిగుమతికి భారత్ ఆర్డర్ ఇవ్వగా మరికొన్ని రోజుల్లో అవి భారత్ కు రానున్నాయి