Thieves Steal Onions In Bengal: డబ్బులు వదిలేసి ఉల్లిపాయలను దొంగిలించిన దొంగలు, పశ్చిమ బెంగాల్‌లో ఘటన, వాటి విలువ రూ. 50 వేలకు పైగానే..,ధరల పెరుగుదలతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి
hThieves Steal Onions From Bengal Shop, Leave Cash Box Untouched (Photo-ANI)

Kolkata, November 30: దేశంలో ఉల్లి ధరలు (Onions Price) ఆకాశాన్ని తాకుతున్నాయి. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి రకం ఉల్లి ధర మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతోంది. ఈ నేపథ్యంలో దొంగలు ఉల్లిపాయలను దొంగిలించే పని(Thieves Steal Onions)లో బిజీ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా(East Midnapore district.)లోని సుతహతా ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు ఐదు క్వింటాళ్లకు పైగా ఉల్లిపాయలను ఎత్తుకెళ్లారు.

కూరగాయల దుకాణం నడుపుతున్న అక్షయ్ దాస్ (Akshay Das) షాపు తెరిచి చూడగా ఉల్లిపాయలు కనిపించలేదు. మొత్తం ఉల్లిపాయల విలువ సుమారు రూ.50 వేలు (onions worth Rs 50,000)ఉంటుందని అక్షయ్ దాస్ తెలిపాడు. దొంగలు ఉల్లిపాయలతోపాటు అల్లం, వెల్లులి గడ్డలను కూడా ఎత్తుకెళ్లారని పేర్కొన్నాడు. అయితే, దుకాణంలో ఉన్న క్యాష్ బాక్సు(cash box)లో డబ్బులు మాత్రం భద్రంగానే ఉన్నాయన్నాడు.

ఈ సంఘటన కన్నా ముందే మహారాష్ట్రలో నాసిక్‌లోని ఒక వ్యాపారికి చెందిన ట్రక్ చోరీకి గురైన సంగతి విదితమే. ఆ ట్రక్ 40 టన్నుల ఉల్లిపాయలతో నవంబర్ 11 న నాసిక్ నుండి బయలుదేరి 22 న గోరఖ్ పూర్ చేరుకోవలసి ఉంది. సమయానికి ట్రక్ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ట్రక్ చోరీకి గురైందని వ్యాపారి ప్రేమ్ చంద్ శుక్లా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టెండూ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ట్రక్ నిలిపి ఉంచినట్లు గుర్తించినప్పటికీ అది ఖాళీగా ఉందని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.