IPL Auction 2025 Live

Madanapalle Murder Case: భార్యను సైనేడ్‌తో చంపేశాడు, అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్, వీడిన మదనపల్లి కేసు మిస్టరీ

భార్య తీసుకువచ్చిన లక్షల కట్నం సరిపోలేదు. అదనపు కట్నం కావాలని భార్యను వేధించాడు. ఇంకా ధన దాహం తీరలేదేమో..ఏకంగా భార్యనే పైకి పంపాడు. ఆమె రోజు వేసుకునే ట్యాబ్లెట్లలో సైనేడ్ ఇచ్చి చంపేశాడు. ఇది మదనపల్లి బ్యాంక్ మేనేజర్ కేసు(Madanapalle Bank Manager Case) కథ.

bank-of-baroda-manager-wife-murder-case-reveals-madanapalle-police (photo-Getty)

Madanapalle,Febuary 4: అతనో బ్యాంకు మేనేజర్, లక్షల్లో జీతం..అయినా ధన దాహం తీరలేదు. భార్య తీసుకువచ్చిన లక్షల కట్నం సరిపోలేదు. అదనపు కట్నం కావాలని భార్యను వేధించాడు. ఇంకా ధన దాహం తీరలేదేమో..ఏకంగా భార్యనే పైకి పంపాడు. ఆమె రోజు వేసుకునే ట్యాబ్లెట్లలో సైనేడ్ ఇచ్చి చంపేశాడు. ఇది మదనపల్లి బ్యాంక్ మేనేజర్ కేసు(Madanapalle Bank Manager Case) కథ.

పూర్తి వివరాల్లోకెళితే.. రోజుకో మలుపు తిరిగుతూ వచ్చిన చిత్తూరు జిల్లాలోని మదనపల్లె బరోడా బ్యాంకు మేనేజర్‌ భార్య హత్య కేసును (Chittoor murder mystery) పోలీసులు చేధించారు.

సైనైడ్‌ తాగడంతోనే ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టమ్‌ నివేదికలో తేలడం, నిందితుడు రవిచైతన్యను అరెస్టు చేసి విచారించడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడు రవిచైతన్య (35)ను, అతని తల్లిదండ్రులను అరెస్టు చేశారు.డీఎస్పీ రవిమనోహరాచారి, ఎస్‌ఐ వెంకటేష్‌ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.

3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య

వారి కథనం మేరకు..మదనపల్లె (Madanapalle) శేషప్పతోటలో నివాసం ఉంటున్న బరోడా బ్యాంకు (Bank Of baroda) మేనేజర్‌ చేబోలు రవిచైతన్య భార్య ఆమనిని జనవరి 27న ఉదయం ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాత్రూమ్‌లో కిందపడి పోయి ఉందని పక్కింటి వారు ఫోన్‌ చేయగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు చెప్పాడు.

ఎయిడ్స్ ఉందని చెప్పినా వదలని కామాంధులు

డాక్టర్లు ప్రథమ చికిత్స అందించినా కోలుకోకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది.

ఆమని మరణవార్త తెలియగానే కృష్ణా జిల్లా ఒంటిమిట్ట మండలం ఇందులూరు నుంచి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, జోగి నాగేంద్రరావు మదనపల్లెకు చేరుకున్నారు. తన బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చారని, బాత్‌రూంలో పడి చనిపోయినట్లు చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరుగుదొడ్డే ఆమె నివాసం, నలుగురు కూతుర్లకు అది ఎంతవరకు రక్షణ ఇస్తుంది ?

వారి ఫిర్యాదు మేరకు ఆమనిది అనుమానాస్పద మృతి, అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మరుసటి రోజు పోస్టుమార్టమ్‌ నివేదికలో సైనైడ్‌ ఇవ్వడంతోనే చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో నిందితుడు రవిచైతన్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.

విచారణలో తానే సైనైడ్‌ తాగించినట్లు నిందితుడు అంగీకరించాడు. భార్యకు సైనైడ్‌ ఇచ్చి చంపినందుకు రవి చైతన్యను, అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడినందుకు రేణిగుంటకు చెందిన రవిచైతన్య తల్లిదండ్రులను కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ, ఎస్‌ఐ వివరించారు.

భయంకరమైన వీడియో, రైలు డోర్ వద్ద నిలబడి డేంజరస్ స్టంట్ చేసిన యువకుడు

కాగా కొంత కాలంగా రవిచైతన్య అదనపు కట్నమంటూ నిత్యం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసి భార్య...అతడిని నిలదీసింది. ఓ వైపు అడిగినంత డబ్బు తీసుకురాలేదని.. మరోవైపు తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన రవి చైతన్య అంతమొందించాలనుకున్నాడు.

ఆమె కొంతకాలంగా విటమిన్‌-బి సమస్యతో బాధపడుతోంది. ఆ సమస్యనే హతమార్చేందుకు ఉపయోగించుకున్నాడు. ఆన్‌లైన్‌లో సైనైడ్‌ లక్షణాలు గల పొటాషియం నైట్రేట్‌ను కొని బీ-కాంప్లెక్స్‌ మాత్రలో పెట్టి భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే చనిపోయింది. భర్త విషమిచ్చి చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబసభ్యులే కాదు స్థానికులు సైతం డిమాండ్‌ చేశారు