Do not do stunts in the train, it is illegal and can prove fatal Ministry of Railways shared dangerous video in Twitter (photo-Ministry of Railways Twitter)

Mumbai,December 30: ఈ రోజుల్లో సాహసం అనేది అత్యంత ప్రమాదకరమైన అంశం అయిపోయింది. టిక్ టాక్(TIK TOK) లాంటి సోషల్ మీడియా యాప్స్ (Social media apps) వచ్చిన తరువాత పాపులారీటీ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వారు వినడం లేదు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది.

తాజాగా రైల్వే శాఖ (Ministry of Railways) ట్విట్టర్లో ట్వీట్ (Twitter)చేసిన ఓ వీడియోని చూస్తూ గుండె ఒక్కసారిగా ఝలదరిస్తుంది. ఈ వీడియో (Video) ద్వారా డేంజరస్ ఫీట్లు (Dangerous Stunts) చేసేవారికి ఇండియన్ రైల్వేస్ (Indian Railways) గట్టి వార్నింగ్ ఇచ్చింది.

ఇండియన్ రైల్వే ట్వీట్ చేసిన వీడియో ప్రకారం కదులుతున్న రైల్ డోర్‌ వద్ద నిలబడి బయటకు వేలాడుతూ ఫీట్‌ చేశాడో యువకుడు. ఈ ఫీట్‌ వికటించి అదుపు తప్పి ప్లాట్‌ఫాం మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు. దీన్ని అక్కడున్న స్నేహితులు షూట్ చేశారు. కనీసం ఆ ప్రయత్నాన్ని వారు ఆపను కూడా లేదు. ఈ ప్రమాదకరమైన స్టంట్ చేసిన యువకుడిని ముంబైకు చెందిన దిల్షాన్ గా గుర్తించారు. డిసెంబర్ 26 న ముంబైలో (Mumbai) ఈ ఘటన చోటు చేసుకుందని రైల్వే శాఖ తెలిపింది.

Here's Dangerous Video

రైలులో ఇలాంటి స్టంట్స్ చేయవద్దు, ఇది చట్టవిరుద్ధం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని ప్రయాణికులకు వారించింది. . భద్రతను పట్టించుకోకుండా, కదిలే రైలు ఎక్కడం, కదిలే రైలులో ఇలాంటి అనాలోచిత ప్రయోగాలు చేయొద్దని సూచించింది