'Liquor Home Delivery': మద్యం డోర్ డెలివరీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పరిశీలించాలని కోరిన అత్యున్నత న్యాయస్థానం, మద్యం అమ్మకాల నిలిపివేతపై ఉత్తర్వులు జారీ చేయలేమన్న సుప్రీంకోర్టు
ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కావాలని కోరుకునే వినియోగదారులకు 'హోమ్ డెలివరీ' (Liquor Home Delivery)అందించేందుకు పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
New Delhi, May 8: దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను (Alcohol Sale) నిలిపివెయ్యాలంటూ నమోదైన పిటీషన్‍లపై విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కావాలని కోరుకునే వినియోగదారులకు 'హోమ్ డెలివరీ' (Liquor Home Delivery)అందించేందుకు పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అమల్లోకి లాక్‌డౌన్ 3.0, దేశ వ్యాప్తంగా తెరుచుకున్న మద్యం షాపులు
మద్యం దుకాణాల వద్ద రద్దీని నివారించడానికి మార్గాలను కనుగొనాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం నిబంధన పాటించడానికి, జనాలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా ఉండేందుకు హోం డెలివరీ ఉపకరిస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
లాక్‌డౌన్ వేళ మద్యం అమ్మకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూసే అవకాశం ఉందని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
Here's what Supreme Court said:
కరోనావైరస్ (Coronavirus) దేశవ్యాప్తంగా విస్తరించిన సమయంలో బౌతికదూరం నిబంధనలను విపరీతంగా ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టులో పిటీషనర్ వెల్లడించారు. అయితే మద్యం అమ్మకంపై నిషేధం విధించటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు
మద్యం అమ్మకాలపై మేము ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయలేము కాని, సామాజిక దూరాన్ని కొనసాగించడానికి రాష్ట్రాలు డోర్ డెలివరీ, లేదా మరేదైనా రకంగా మద్యం అమ్మకాలను చేపట్టాలని అత్యున్నత ధర్మాసనం వీడియో-కాన్ఫరెన్సింగ్ ద్వారా సూచించారు. ఢిల్లీలో వైన్ షాపు వద్ద లాఠీఛార్జ్, సామాజిక దూరాన్ని పాటించని ఢిల్లీ మద్యం ప్రియులు, వైన్ షాపు మూసివేసిన పోలీస్ అధికారులు
మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం ప్రకటించిన సడలింపులతో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్న మద్యం ప్రియులు మద్యం దుకాణాలబయట వందలాది మంది క్యూలు కట్టారు, భౌతిక దూరాన్ని పాటించడం మానేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం అందజేస్తున్న సంగతి తెలిసిందే.