'Ready to Hug Corona Patient': కరోనా లేనే లేదు, పేషెంట్లను కౌగిలించుకోవడానికి నేను సిద్ధం, సీఏఏ, ఎన్నార్సీ దారి మళ్లించడానికే ఈ ఎత్తుగడ, సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్‌పీ లీడర్, మాజీ ఎంపీ రమాకాంత్ యాదవ్
కరోనావైరస్ అనేది ఒట్టి పుకారు మాత్రమేనని ఇండియాలో కరోనా లేనే లేదంటూ ఆయన (former SP MP Ramakant Yadav) వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వం కరోనాపై లేనిపోని అపోహలను, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని తీవ్రంగా ఆరోపించారు. ప్రపంచంలో కరోనా ఉండవచ్చు అయితే ఇండియాలో మాత్రం కాదని ఎన్‌ఆర్‌సి(NRC), సిఎఎ(CAA), ద్రవ్యోల్బణ సమస్యను దారి మళ్లించడానికే దీనిని ఇంతలా బీజేపీ పాపులర్ చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Lucknow, Mar 21: దేశంలో కరోనా (CoronaVirus) పంజా విసురుతున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ (Samajwadi Party) నేత రమాకాంత్ యాదవ్ కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్ అనేది ఒట్టి పుకారు మాత్రమేనని ఇండియాలో కరోనా లేనే లేదంటూ ఆయన (former SP MP Ramakant Yadav) వ్యాఖ్యానించారు.
ఇండియాలో 271కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వం కరోనాపై లేనిపోని అపోహలను, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని తీవ్రంగా ఆరోపించారు. ప్రపంచంలో కరోనా ఉండవచ్చు అయితే ఇండియాలో మాత్రం కాదని ఎన్‌ఆర్‌సి(NRC), సిఎఎ(CAA), ద్రవ్యోల్బణ సమస్యను దారి మళ్లించడానికే దీనిని ఇంతలా బీజేపీ పాపులర్ చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం, ఒక్కరోజే 627 మంది కరోనాకు బలి
కరోనా వైరస్ (coronavirus in India) కారణంగా భారతదేశంలో ఏ ఒక్కరూ మృతి చెందలేదని అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కౌగిలించుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేశంలో నడుస్తున్న సీఏఏ, ఎన్నార్సీ ఆందోళనల నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చడానికే మోదీ సర్కారు కరోనా అనే దానిని ఎత్తుకుందని రమాకాంత్ ఆరోపించారు. కరోనా సోకిన వ్యక్తిని కౌగిలించుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని సమాజ్ వాదీ పార్టీ లీడర్ రమాకాంత్ యాదవ్ తెలిపారు.
Here's Video
కాగా ప్రపంచంలోని చాలా దేశాలు కరోనావైరస్ బారిన పడుతున్నాయి. మార్చి 20 నాటికి భారతదేశంలో మొత్తం ఈ వ్యాధి బారీనపడిన వారి సంఖ్య 271కి చేరుకుంది. మార్చి 13 న సోకిన వారి సంఖ్య 89 కాగా, మార్చి 14 న ఇది 96 కి చేరుకుంది. మార్చి 15 న, కరోనాకు 112 కేసులు నమోదయ్యాయి.
ఈనెల 22న 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మార్చి 16 న ఇది 124 కు పెరిగింది. మార్చి 17 న 139 కేసులు ఉండగా, మార్చి 18 న ఇది 168 కి పెరిగింది. మార్చి 19 న 195 కేసులు నమోదయ్యాయి, మార్చి 21 నాటికి 271 కేసులు నమోదయ్యాయి. ఇంతలా కరోనా విశ్వరూపం చూపిస్తుంటే సమాజ్ వాది పార్టీ లీడర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కనికా కపూర్‌కు కరోనా, కరోనా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్న ఎంపీలు
కాగా మార్చి 22 న ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు "జనతా కర్ఫ్యూ" అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు సంబంధించిన వ్యక్తులు కాకుండా, ఈ సమయంలో వ్యక్తులు ఎవరూ ఇంటిని విడిచిపెట్టకుండా ఉండాలని ప్రధాని ప్రజలకు సూచించారు.