COVID-19 Deaths in India: డేంజర్ జోన్‌లో 11 రాష్ట్రాలు, గంట గంటకు పెరుగుతున్న కరోనా కేసులు, దేశ వ్యాప్తంగా 109 మంది మృతి, 4067కు చేరిన కోవిడ్ 19 కేసులు
మహమ్మారి కోవిడ్-19 (COVID-19) భారత్‌లో గంట గంటకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత 12 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 490 కరోనా కేసులు (Coronavirus in india) నమోదయ్యాయి.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4067 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గడిచిన 12 గంటల్లోనే ఏకంగా 490 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
New Delhi, April 6: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 Pandemic in India) పెరిగిపోతున్నాయి. మహమ్మారి కోవిడ్-19 (COVID-19) భారత్‌లో గంట గంటకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత 12 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 490 కరోనా కేసులు (Coronavirus in india) నమోదయ్యాయి.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4067 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గడిచిన 12 గంటల్లోనే ఏకంగా 490 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలు దాటిన కరోనా కేసులు
ఈ మహమ్మారి కారణంగా 109 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ప్రస్తుతం 292 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోగా... మరో 3666 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 700 మందికి కరోనా పాజిటివ్‌గా తేలారు. 690 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట తొలిస్థానంలో ఉండగా, తమిళనాడు 571, ఢిల్లీ 503 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దియా జలావొ గ్రాండ్ సక్సెస్, కరోనాను తరిమికొట్టడానికి ఏకమైన దేశ ప్రజలు
తెలంగాణలో 321, కేరళలో 314, రాజస్థాన్‌లో 253, ఆంధ్రప్రదేశ్‌లో 226, ఉత్తరప్రదేశ్‌లో 221, మధ్యప్రదేశ్‌లో 165, కర్ణాటకలో 151, గుజరాత్‌లో 122, జమ్మూకశ్మీర్‌లో 106 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదైయ్యాయి. కాగా అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది. అక్కడ మొత్తం 690 మంది కరోనా బారిన పడగా.. తమిళనాడులో 571, ఢిల్లీలో 503 కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో కరోనా మృత్యుఘోష,మోడీ సాయం కోరిన ట్రంప్
వేగంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా 11 రాష్ట్రాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించారు. ఆదివారం సాయియంత్రం 6 గంటల వరకు దేశం లో 3,577 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 86 శాతం కేసులు 11 ర్రాష్ట్రాల్లోనే కనిపించాయి.
ఏపీలో 252కు చేరిన కరోనా కేసులు
మహారాష్ట్ర ,తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, తమిళనాడు,ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ ,మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,గుజరాత్, కర్నాటక రాష్ట్రాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించారు. వైరస్ తీవ్రంగా వ్యాపించిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పూర్తిగా నిలిచిపోయే వరకూ కఠినంగా వ్యవహరించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది.